About Us

డైలీన్యూస్ ననుసరించి పోస్టులతో న్యూస్-గీత


నేటి న్యూస్ రేపు ఒక కధనం కావచ్చును. నేటి న్యూస్ రేపొక సంచలనం కావచ్చును. నేటి సంచలనం భారీ మార్పునకు శ్రీకారం కావచ్చును. ఘటనలను స్యూస్ చెబితే, అవి వ్యాప్తి చెందినదానిని బట్టి వాటి ప్రభావం ఉంటుంది. ఎంత ఎక్కువమంది స్పందిస్తే అంత ప్రచారం ఉంటుంది. ఈ న్యూస్ ఒక నాయకుడు నిర్ణయం ద్వారానో, ఒక వ్యవస్థ నిర్ణయాన్ని అనుసరించో ఉండవచ్చు.

కొన్ని ఘటనలు ప్రకృతిరిత్యా జరుగుతాయి. వీటి ప్రభావం ప్రాంతాలపైనే ఉంటుంది. ఆ ప్రాంతవాసులందరినీ జీవితాలను మార్చేస్తాయి. అప్పుడు వ్యవస్థలే స్పందిస్తాయి.

ఏదైనా ఒక న్యూస్ ఘటనను తెలియజేస్తే, కధనం న్యూస్ కారణాన్ని తెలియజేస్తుంది.

సినిమా న్యూస్ వచ్చి సినిమాలపై గల ఆసక్తిని పెంచుతూ ఉంటాయి. ఏ హీరోకి సంబంధించిన న్యూస్ వస్తే, ఆ హీరోపై ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. సినిమాలు మనిషికి వినోదం అందిస్తాయి. కాబట్టి ఆ న్యూస్ కోసం సెర్చ్ చేసేవారు కుడా ఉంటారు. ఆర్ధిక మాంద్యంలో కూడా సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యి కొత్త రికార్డులు క్రియేట్ చేశాయంటే, అభిమానులకు వినోదం వైపు ఉత్సాహంగా ఉన్నారు.

ఇక న్యూస్ లలో ఆందోళన కలిగించే విషయం, అమ్మాయిలపై అఘాయిత్యం. అమ్మాయి అమ్మగా మారితేనే మనం అన్న విషయం మరిచి, అమ్మాయిలపై ఘోరాలను చేసేవారు సామాజిక ద్రోహులే. మనిషికి జన్మనిచ్చే స్త్రీ అంటే గౌరవించే మన సంప్రదాయం భారతీయ సంప్రదాయం. నేటి న్యూస్ మాత్రం అమ్మాయిలపై అఘాయిత్యం.

ఇంకా అమ్మలుగా మారిన అమ్మాయిలు కూడా దారి తప్పడం కూడా వివాహేతర సంబంధాలకుదారితీస్తున్నాయి. పుట్టుకతోనే మనకు కొన్ని బంధాలు ఉంటే, పెరిగే కొలది కొన్ని బంధాలు ఏర్పరచుకుంటాం. చివరకు అమ్మానాన్న చేరిన పరలోకానికే పయన అవుతాం. కానీ అమ్మానాన్న ఆచరించిన సంప్రదాయానికి కొత్త పోకడలు తెచ్చి పెట్టడం. ఇలా బంధాల విలువలు మార్చేసుకుంటున్న యువత.

నేటి న్యూస్ మనకు ఇస్తున్న గీతాసారం ఏమిటి? నాడు భగవంతుడు, భక్తునికి బోధించిన గీతలో ధర్మం జీవిత పరమార్ధం తెలుసుకునే జ్ఙానం ఉంటే. నేటి న్యూస్ ఉండే సామాజికి మార్పు ఎటువైపు వెళుతుంది....

మీ న్యూస్ గీతలో చిన్న చిన్న విశ్లేషణలతో న్యూస్ గీత.

ధన్యవాదాలు - న్యూస్ - గీత

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...