Saturday, March 7, 2020

స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి-జనసేన స్థానిక బలం

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేష్ విడుదల అయ్యింది. మార్చి 9, 2020 నుండి మార్చి 11, 2020 వరకు ఎంపిటిసీ, జడ్పిటిసీ ఎన్నికలకు నామినేషన్స్ స్వీకరిస్తారు. మార్చి 12, 2020 తేదీన వాటిని పరిశీలిస్తారు. మార్చి 14, 2020 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 21, 2020 తేదీన ఎంపిటిసీ, జడ్పిటిసీ లకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 24న ఓట్ల లెక్కింపు. ఇంక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 23, 2020న ఫలితాలు మార్చి 27, 2020న ప్రకటిస్తారు.

పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు తొలిదశలో మార్చి 17, 2020 నుండి మార్చి 19, 2020 వరకు స్వీకరిస్తారు. మార్చి 27, 2020 తేదిన తొలిదశ పంచాయితీ ఎన్నికలు ఉంటాయి, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. రెండవదశలో మార్చి 19, 2020 నుండి మార్చి 21, 2020 తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండవదశ పంచాయితీ ఎన్నికలు మార్చి 29, 2020తేదీన ఉంటాయి, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది.



పై విధంగా స్థానిక సంస్థల ఎన్నికల జరగనుంది. ఈ సారీ ఈ ఎన్నికల పోటీలో వైసిపి, టిడిపి, బిజెపి - జనసేన పార్టీలు పోటీ చేయనున్నాయి. వైసిపి అధికారంలో ఉంది. టిడిపి ప్రతిపక్షంలో ఉంది. వైసిపికి, టిడిపికి నాయకత్వంతో బాటు రాష్ట్ర నాయకత్వం బలం. అయితే బిజెపి-జనసేన విషయంలో పాపులారిటి బాగా ఉంది. స్థానికంగా పట్టు ఎంతమాత్రం వరకు అనేది చూస్తే గతంలో విడివిడిగా పోటీ చేసిన బిజెపి - జనసేన ఓటింగ్ శాతం చాలా తక్కువ.

పార్టీ అధినేత, అగ్రనాయకులు పాపులారిటీ ఓటింగ్ ట్రెండును ప్రభావితం చేస్తే, స్థానిక కార్యకర్తల కార్యాచరణ ఓటర్లను ఆకర్శించడంలో చేసిన కృషి పార్టీల గెలుపుకు దోహదపడతాయి. మరి స్థానిక సంస్థలలో ఆయా లోకల్ లీడర్సే ప్రధానం. పార్టీపై అభిమానం, అగ్రనాయకత్వంపై అభిమానంతో బాటు లోకల్ లీడర్స్ ప్రభావం స్థానిక సంస్థలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల స్థానిక బలంతో పాటు బిజెపి-జనసేన స్థానిక బలం పెరగాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానం.

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...