Wednesday, March 4, 2020

నేటి సినిమా ట్రెండ్ నాటి పరిస్థితులు నాటి కధాంశాలతో

ఒకప్పటి సినిమాల ట్రెండులో హీరో ఇంట్లో వారి మాట వినకపోవడం ఉండేది. తర్వాత పెద్దల మాట వినడంగా మారింది. ఇప్పుడు గతానికి వెళ్లడంగా మారుతుంది. గత చరిత్ర ఆధారంగా గతకాలాన్ని మనకు వెండితెరపై చూపించడం నేటి ట్రెండుగా మారుతుంది.

ఈ దిశలో ఇప్పటికే మనకు మగధీర ఒకప్పటి క్షత్రియ వీరులను గుర్తు చేస్తూ వచ్చింది. బాహుబలి ఒకప్పటి క్షత్రియులలో రాజకీయ కుట్ర, వీరోచిత యుద్దాలను చూపింది. అలా రాజమౌళి గతకాలాన్ని మనకు వెండితెరపై చూపించారు. అలాగే గుణశేఖర్ రామాయణం బాలలతో తీసి చూపారు. తర్వాత రుద్రమదేవి సినిమాలో నాటి పోరాటాలు చక్కగా చూపారు. గుణశేఖర్ సినిమాలు సాంఘికంగా ఉన్నా సంప్రదాయలను చూపుతూ ఉంటాయి. అల్లు అర్జున్ హీరోగా వరుడు సినిమా కూడా పాత పద్దతిలో పెళ్ళి చేసుకోవాలనే తపన కలిగిన యువకుడి కధగా తీసుకువచ్చారు.



చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా అయితే బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు వెండితెరపై వెలిగాయి. నాటి పరిస్థితిలో మనం వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సైరా నరసింహారెడ్డి సినిమాను అంత చక్కగా సురేందర్ రెడ్డి తీర్చిదిద్దారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించి, తండ్రికి కానుకగా అందించారు. తెలుగు ప్రజల ఆధరణ కూడా అలాగే లభించింది, ఈ సినిమాకు.

మగధీర, బాహుబలి, రుద్రమదేవి, సైరా నరసింహారెడ్డి సినిమాలను ప్రేక్షకులు ఆధరించడంతో ఈ తరహా సినిమాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. గత చరిత్ర ఆధారంగా గతకాలాన్ని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతున్నారో, అంతే ఆసక్తి సినీ వర్గాలు కూడా చూపుతున్నాయి. ఈ తరహా భారీ సినిమాలకు ఊతమిచ్చిన రాజమౌళి మరలా తీసుకువస్తున్న భారీ సినిమా, ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాతో కూడా స్వాతంత్ర సమరం కాలంలోకి మనం వెళ్లవలసి ఉంటుంది. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను చూడగలం.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ సినిమా కూడా 1970 నాటి కాలం మనకు కనబడుతుంది. అప్పటి యూరప్ వాతావరణం ఈ సినిమాలో కనబడనుండి. ప్రభాస్ ఇప్పటికే మహారాజుగా మంచి మార్కులు సంపాదించారు.

పవన్ కళ్యాణ్ హీరో క్రిస్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కూడా చారిత్రక కధాంశంతోనే ఉంటుందని సమాచారం.

ఇలా నేటి సినిమా ట్రెండ్ నాటి పరిస్థితులు, నాటి కధాంశాలతో నిర్మాణం జరగడం విశేషం. చారిత్రకంగా భారతదేశంలో కధలకు కొరవ ఉండదు. కధనంలో పట్టు లేకపోవడం అంటూ ఉండదు. పెట్టుబడి పెట్టాలని కానీ ఆధ్యంతం ఆసక్తికరంగా సినిమాను తీయగలమని తెలుగు దర్శకులు నిరూపించారు. ఇంకా ఇటువంటి సినిమాలు నిర్మితమైతే, సమాజంలోకి గతకాలపు విలువల గురించి, నాటి పరిస్థితుల గురించి ఇప్పుడు పరిచయం అవుతుంది.

ధన్యవాదాలు .....

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...