Wednesday, March 4, 2020

మూడు వన్డేల క్రికెట్ సిరీస్ కు కొత్త కెప్టెన్?

మూడు వన్డేల క్రికెట్ సిరీస్ కు కొత్త కెప్టెన్?

న్యూజిలాండ్ సిరిస్ ఓటమితో ముగించిన టీమిండియా ఈ నెలలో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నెల 12వ తేదీ నుండి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలలో టీమిండియా తలపడనుంది. ఫస్ట్ వన్డే 12న ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సెకండ్ వన్డే 15న లక్నోలో ఏకనా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. థర్డ్ వన్డే 18న కోల్ కతాలో ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.

విరామం లేకుండా విరాట్ కోహ్లి క్రికెట్ ఆడుతుండడంతో, అతనికి విశ్రాంతి లభించనుంది. ఒకవేళ కోహ్లి విరామం తీసుకుంటే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండకపోవచ్చును. అతను ఇప్పటికే గాయంతో న్యూజిలాండ్ సిరీస్ నుండి అప్పటికప్పుడు తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉండవచ్చును. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండా టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాల్సిన పరిస్థితి సెలక్టర్లకు తప్పేటట్టులేదు.



దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కు కొత్త కెప్టెన్ సెలక్ట్ చేయాలంటే ముగ్గురు రేసులో ఉండవచ్చును. ఒకరు ఓపెనర్ శిఖర్ ధావన్. ఇతను సీనియర్ ఆటగాడు. గతంలో ఐపిఎల్ టీమ్స్ కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇంకా ఇండియా-ఎ క్రికెట్ టీమ్ కు కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉంది.

ఇక రెండవ ఆటగాడు లోకేష్ రాహుల్, ఇతను మంచి ఫామ్ లో ఉన్నాడు. అంతేకాక న్యూజిలాండ్ సిరీస్లో ఆఖిరి టి20 మ్యాచుకు నాయకత్వం వహించి, ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐపిఎల్2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కు సారధ్య బాధ్యతను చేపట్టనున్నాడు. మూడవ ఆటగాడు, అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పటికే ఐపిఎల్లో డిల్లి కేపిటల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు.

కొహ్లికి విశ్రాంతినిస్తే, రోహిత్ అందుబాటులో లేకపోతే ఈ ముగ్గురిలో అనుభవం పెద్దపీటగా చూసుకుంటే, శిఖర్ ధావన్ కు అవకాశం అందవచ్చును. లేకపోతే మిగిలిన ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అందవచ్చును.

భారత్ కు రానున్న దక్షిణాఫ్రికా జట్టు: క్వింట‌న్ డికాక్ (కెప్టెన్‌), టెంబా బ‌వుమా, ర‌స్సీ వాన్ డ‌ర్ డ‌స్సెన్‌, డుప్లెసిస్‌, కైలీ వెర్రేన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, జాన్ స్మ‌ట్స్‌, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూర‌న్ హెండ్రిక్స్‌, ఆన్రిచ్ నోర్జ్‌, జార్జ్ లిండే, కేశ‌వ్ మ‌హారాజ్‌.

ధన్యవాదాలు ....

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...