Tuesday, March 3, 2020

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది?

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది? 

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది? ఈప్రశ్న వినగానే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఎంతో విశ్వాసంగా మాటలు చెబుతున్న ఈ రోజుల్లో అటువంటి ప్రశ్న హాస్యాస్పదమే. అయితే ఒక వ్యక్తి పుట్టుకతోనే అతని కుటుంబాన్ని బట్టి సంఘంలో స్థితి ఏర్పడుతుంది. ఆస్థితి తగినంత హోదాను కూడా తీసుకువస్తుంది.


బాగా డబ్బు, పలకుబడి ఉన్నవారి పిల్లలను సరదాగా ఆటపట్టించడం కూడా కొందరు చేయరు. అక్కడే ఆ పిల్లవానికి చొరవ, ఉత్సాహం ఎక్కువ అవుతాయి. బాగా గారబం ఉంటే, అటువంటి పిల్లల మాటలకు అదుపు కూడా ఉండదు. ఈ విధంగా పుట్టుకతోనే ఉండే కుటుంబ పరిస్థితులతో ఎవరికివారికే తగినంత విశ్వాసం ఉంటుంది. చేస్తున్న పనులలో స్థైర్యం ఉంటుంది. ఏ పనినైనా విశ్వాసంతో చేయగలడం సాదారణమే.

అయితే తన స్థాయిని దాటి తలపెట్టిన పనులలో మాత్రం మనిషికి నమ్మకం తగ్గే అవకాశం లేకపోదంటారు. ఒక మద్యతరగతి స్టూడెంట్, ఐఏఎస్ కావాలంటే, దానికి తగ్గట్టుగా అతను చేయాలి. అతని సంకల్పాన్ని ప్రొత్సహించేవారు ఉండాలి. ఆ చదువుకు తగ్గట్టుగా మెటీరీయల్ అందుబాటులో ఉండాలి. ఇవ్వన్ని కూడ గట్టుకునే విషయంలో ఎవరైనా 'ఓరేయ్... మీనాన్న సంపాధన అంతంత మాత్రమే, నీకెందుకురా... పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటావ్... ఈ వయస్సులో మీ నాన్నకు సాయం ఉండాలి. కానీ అతనికి భారమైతే ఎలా ?' అన్ని ప్రశ్నించేవారు కూడా ఉంటారు. కొందరైతే 'నీ మొఖానికి ఐఏఎస్ కావాలా? ఐఏఎస్ పాసయ్యే మొఖమేనా? ' అని నిరుత్సాహపరిచేవారు ఉండవచ్చును. ఇలాంటి పరిస్థితులలో తనపైతనకు నమ్మకం తగ్గే అవకాశాలు ఉంటాయి.

సాదారణంగా తన చుట్టూ ఉన్నవారు తనలాగానే ఉండడం చూసి సంతోషంగా ఉంటారు. తనకన్నా బాగున్నా సంతోషించేవారుంటారు. అయితే అందనిదేదో సాధించాలన్నప్పుడే నిరుత్సాహభరితమైన మాటలు చెవిన పడుతూ ఉంటాయి. అలా అందనిది సాధించినవారిని ఒక ఉదాహరణగా చూపించినా అది వారి అదృష్టంగా చెబుతారు. కానీ కృషి చేస్తే సాధించవచ్చును. అనేది మాటలకు ఊతమిచ్చే విధంగా వ్యక్తికి తోడ్పాటు తొందరగా దొరకదు.

అందుకే ఏదైనా ఇంతకుముంద తమ చుట్టూ ఉన్నవారు సాధించనిది సాధించాలంటే మాత్రం తనపై అపనమ్మకం కలిగించే ప్రదేశానికి దూరంగా ఉండడమే ఉత్తమం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో స్వయంకృషితో ఎదిగిన స్టార్. అతను సినిమాలో క్యారెక్టరుగా వచ్చి, విలనుగా నటించి, హీరోగా మారాడు. డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ గా ఎదిగారు. అటువంటి చిరంజీవి కూడా కెరీర్ ప్రారంభంలో ఒక బజారుకే వెళ్లడం మానివేసినట్టుగా ఒక పత్రికకు చెప్పుకొచ్చారు. ఆ ముచ్చట చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఏదైనా సాధన మొదలుపెడితే, దానికి వ్యతిరేక మాటలు చెప్పేవారిని, లేక నిరుత్సాహపరిచేవారి వద్దకు ప్రారంభంలోనే వెళితే, సాధ్యం కూడా అసాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు ......

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...