Monday, March 2, 2020

కరోనా వైరస్ ఇండియా

కరోనా వైరస్ ఇండియా

కరోనా వైరస్ ఇండియా కు వచ్చేసింది. అంటే ఆందోళన వస్తుంది. ఆ వెంటనే వైరస్ లక్షణాలు తెలుసుకోవాలి. అనవసర అనుమానలకు తావివ్వకూడదు. సందేహం ఉంటే డాక్టరును కలవడం, టెస్ట చేయించుకోవడం. ఎందుకంటే కరోనా వైరస్ కు ఆధునిక మందులు ఇంకా లేవు. ఇది ప్రాణాంతక వ్యాధి అన్న ప్రచారం ఊపందుకొని ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి.

చైనాలోపుట్టిన కరోనా వైరస్ పలువురి మరణానికి కారణమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ రాకపోకలలో కరోనా వైరస్ గురించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయిను వైరస్ హస్తినకు వచ్చింది. వైరస్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం, భయమొద్దు. పుకార్లు నమ్మవద్దు అంటూ ప్రకటనలు వెలువడుతున్నాయి.

ఇండియాలో హస్తినకు రావడమే కాదు. తెలంగాణలో హైదరాబాదుకు కరోనా బాధ తగిలింది. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు కొవిడ్-19 నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆందోళన చెందనవసరం లేదు హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. కరోనా వైరస్ గురించి వివరాల కోసం, సలహాల కోసం  040 24651119 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయవచ్చును.

కేంద్ర ఆరోగ్య శాఖ 24గంటల కరోనా వైరస్ కు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు హెల్ప్ లైన్ నెంబరు 91-11-23978046 అందుబాటులో ఉంది. కొవిడ్-19 కు సంబంధించిన సందేహాల కోసం, సలహాల కోసం ఈ నెంబరు ఫోన్ చేయవచ్చును.



ఇంకా ఈ మహమ్మారి నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలి? దానిపై జాగ్రత్తలను సూచిస్తూ ఒక పిడిఎఫ్ ఫైల్ కూడా తెలుగులో అందుబాటులో ఉంది.  కరోనా వైరస్ సోకే అవకాశాన్ని తగ్గించుకోండి. క్రింది జాగ్రత్తలను పాటించండి అంటూ ఈ ఫైల్ మీకు సూచనలను తెలియజేస్తుంది. ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేసి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇండియాలో ఆత్మవిశ్వాసం అధికం. అలాగే పుకార్లకు బలం ఎక్కువ. పుకార్లను పట్టించుకోకుండా, వాస్తవం తెలుసుకున్న ఏ భారతీయుడుకైనా పరిష్కారం లభిస్తుంది.

ధన్యవాదాలు ---

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...