Thursday, March 5, 2020

కరచాలనం కన్నా నమస్కారం మిన్న అన్న విషయం

కరోనా కలకలం మనకు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా పాకుతున్న కరోనా ఇండియాలోకి, తెలుగు రాష్ట్రాలలోకి కూడా వచ్చేసింది. కరోనా కలిగిన దేశియులు విదేశాల నుండి రావడంతో కరోనా ఇక్కడ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే కరోనా గాలి ద్వారా సోకదు, కరచాలనంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ అంటున్నారు.

ప్రాణాంతకమైన వ్యాధి సోకకుండానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కరోనా వైరస్ కు మందులేదు. మందు లేనివ్యాధికి నియంత్రణ ఉండదు. అయితే మన వాతావరణంలో అంత కరోనా వైరస్ కు అనుకూలం కాదు. కానీ వైరస్ సోకిన వ్యక్తినుండి వ్యక్తి సోకే అవకాశం ఎక్కువ.  కాబట్టి ఆ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. అందుకు తగ్గట్టు సామాజిక పరిస్థితులు కూడా ఉండాలి.

కరోనా కలిగిన వ్యక్తులు సమాజంలో తిరుగుతున్నారు. కాబట్టి కరోనా వైరస్ వ్యాధి తగ్గేవరకు వ్యవస్థలకు కూడా సెలవులు ఉంటే బాగుంటదనే వెంకటకృష్ణ విశ్లేషణ వీడియో చూడండి.



కరచాలనం కన్నా నమస్కారం మిన్న అన్న విషయం సనాతనంగా భారతీయులు చెప్పేది. కరచాలనంతో మరొక మనిషి చేతితో చేయి కలపడం కానీ నమస్కారం ఎదుటి మనిషిలోని ఆత్మారాముడికి పెట్టేది. కరచాలన మనకు కూడా అలవాటుగా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ అలవాటును కరోనా వలన తగ్గించుకోవాలసిందే. కరోనా రాకుండా కరచాలనం చేయకుండా నమస్కారం చేయడం ఒక రెమెడీగా ఉంది.

ధన్యవాదాలు ....

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...