Saturday, March 7, 2020

చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్.

ముంబై వాంఖైడ్ స్టేడియంలో చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫోర్లతో స్టేడియం చుట్టూ బంతిని పంపించిన సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ పార్టనర్ షిప్. రిటైరైనవారు మరలా ఇండియా తరపున ఆడడం ఏమిటి? అనుకుంటున్నారా? రోడ్ సేఫ్టిపై అవగాహన పెంచేందుకు నిధుల సమీకరణకు మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్వహిస్తున్న లెజండరీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ టీమ్ తో శనివారం తలపడింది.



లెజండరీ టి2020 వరల్డ్ సిరీస్ లో ఆరంభ మ్యాచులో వెస్టిండీస్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసి, 20ఓవర్లలో 150 పరుగులు చేసింది. చందర్ పాల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ ఉంటే, భారత బౌలింగ్ లో ప్రజ్ఙాన్ ఓజా, జహీర్ ఖాన్,  మునాఫ్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టార్గెట్ చేదించింది. ఇందులో సెహ్వాగ్ 11 ఫోర్లతో 57 బంతుల్లో 74 పరుగులు చేస్తే, సచిన్ టెండుల్కర్ 29బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు. వీరిద్దరి బ్యాటింగ్ స్టేడియంలో అందరినీ అలరించింది.

ఈ సిరీస్ లో భాగంగా భారత్ జట్టు మంగళవారం శ్రీలంకతో ఆడనుంది. ఇంకా ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా మ్యాచులు ఆడనున్నాయి. పాత ఆటగాళ్ల సొగసైన ఆటను ఈ లెజండరీ టి20 సిరీస్ లో చూడవచ్చును.

ధన్యవాదాలు

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...