Saturday, March 21, 2020

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు.
మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమాజానికి రక్షణ. కరోనా వైరసుకు సోకకుండా నివారణ ముఖ్యమంటున్నారు. అశ్రద్ద వలననే ఇటలీలో కరోనా వ్యాప్తి చెంది అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అదీ అతి కొద్ది కాలంలోనే.

మేలైన మాటలు వినడం కన్నా పాటించడం ముఖ్యం. ఇక ఆరోగ్యానికి సంబంధించినవి ఖచ్చితంగా పాటించాలి. అయితే అదీ సామాజికపరమైన ఆరోగ్య రక్షణకు అయితే ముమ్మాటికీ పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి సోకి వేలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వ్యాధిని అరికట్టాలంటే, యుద్దమే చేయాలి.

నిత్యం అందరితో కలిసిమెలిసి ఉండే జనులు నేడు ఒంటరిగా కాలం గడుపుతూ కరోనాపై యుద్దం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా కలిగితే ప్రాణాలో పోవడంతో బాటు అది మనద్వారా మరింతమందికి సోకే అవకాశం ఉంది. కాబట్టి మనకు రాకుండా జాగ్రత్తలు పాటించడం మన ప్రధానమైన కర్తవ్యం. మనందరి సామాజిక బాధ్యత.

ప్రధాని నరేంద్ర మోదీగారు పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను గెలవాలంటే, భారతీయుల ఐక్యత చాలాముఖ్యం. అయితే ఈ ఐక్యత ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇంటిలోనే ఉండడం. ఈ రోజు ఆదివారం. ఆదివారం అందరితో కాకుండా మనలో ఉన్న ఆత్మబంధువుతో మమేకం కావడం వలన ఏకాంతంగా ఉంటూ, మానసికంగా దృఢంగా తయారు కావచ్చును. కరోనా అడ్డుకోవడంలో మనవంతు కృషి చేసినవారము అవుతాం.

కేవలం ఈరోజుకే పరిమితం కాకుండా కొన్ని వారాలపాటు ఏకాంతంగా మెసలడం ముఖ్యం. నలుగురితో కలిసి తిరగకుండా ఒకరినొకరు దూరంగా మెసలడం. జనసంద్రం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడం చాల ముఖ్యం. అవసరం మేరకు మాటలు తగు జాగ్రత్తతో మాట్లాడడం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించడం చాలా ముఖ్యం.

కరోనా వలన దేశాల పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. కాలం కలసి రానప్పుడు నిదానంగా నిలబడడమే ముఖ్యమంటారు. ఇప్పుడు కాలం కరోనా కాలం కాబట్టి నిదానమైన ప్రధాన పనులు మాత్రమే తగు జాగ్రత్తతో ఉంటే, భవిష్యత్తులో కరోనా ప్రభావం తగ్గుతుంది. ఇటలీ, చైనా దేశాలకు పట్టిన గతి మనకు పట్టకూడదంటే, ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉండకూడదు. కరోనాపై ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఒకరికొకరికి దూరం పాటించడం. ఎప్పటికప్పుడు శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని సూచిస్తున్నారు.

కరోనాను కలసిగట్టుగా ఎదుర్కోవాలి. అంటే ఒకరినొకరు తాకకుండా సాద్యమైనంత దూరం పాటించడంలో అంతా కలిసిగట్టుగా ప్రయత్నించాలి.

ధన్యవాదాలు

కరోనా కష్టం చిరువ్యాపారికి నష్టం

కరోనా కాలం చిరువ్యాపారికి కష్టకాలం. కష్టంచేసుకుని బ్రతికే చిరువ్యాపారులకు కరోనా కాలం కష్ట కాలమే..

కరోనాకు కష్టకాలం రావాలంటే దేశమంతా ఏకం కావాలి

కరోనాకు కష్టకాలం రావాలంటే దేశమంతా ఏకం కావాలి

ఒక కష్టం వస్తే ఏకం కానీ కుటుంబం ఉండదు. ఒక ఉపద్రవం వస్తే ఏకం కానీ ప్రాంతం ఉండదు. కానీవారితో కూడా కలిసి పనిచేస్తాం కష్టకాలంలో... కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని సవాలు చేస్తుంది. పూర్వంలో రాక్షసులు మనుషుల్ని పీడించేవారు అని అంటారు. కానీ ఇప్పుడు వైరస్ లు మాత్రం మనిషికి మహా శత్రువుగా మారుతున్నాయి.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీగారు జనతా కర్ఫ్యు పిలుపినిచ్చారు. అంతర్జాతీయంగా కూడా ఈ పిలుపుకు ప్రధాన్యత ఏర్పడింది.

ప్రపంచంలో మొదటి కరోన కేసు నమోదైన చైనాలో కరోనా కేసులు ఇప్పుడు లేవంటున్నారు. లేటుగా ప్రవేశించిన కరోనా మన దేశంలో రెండవ దశలో ఉంది. ఈ దశలోనే కరోనా అంతం కావాలంటే, దేశమంతా ప్రధాని మోదీగారు ఇచ్చిన పిలుపుకు ఏకం కావాల్సిందే.


గతంలో రకరకాల వైరసులు వచ్చి మానవులపై ప్రభావం చూపాయి. కానీ ఇప్పుడు కరోనా లోకాన్ని కలవరపెడుతుంది. వేలాదిమందిని బలిగొంది. ఒకరి నుండి ఒకరికి పాకే ఈ అంటువ్యాధిని అరికట్టడానికి శుభ్రతతో బాటు ఏకాంతంగా ఉండడం కూడా ముఖ్యమని అంటున్నారు.

గుంపులో ఒకరికి కరోనా వైరస్ వచ్చి ఉంటే, ఆ గుంపులో మిగిలినవారికి కూడా సోకే ప్రమాదం ఉంది. అటువంటి కరోనా నివారణకు గుంపులలో తిరగకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎక్కువమంది తిరిగే మార్కెట్లలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడవలసిని కాలం కరోన వలన మనకు కలిగింది.

శుభ్రతతో బాటు ఎదుటివారితో మాటలవరకే పరిమితం కావాలి. కరచాలనం కన్నా నమస్కారం మిన్న. కరచాలనం ద్వారా కూడా కరోనా వైరస్ సోకవచ్చును. ఈ క్రింది వీడియో ద్వారా కరోనా ఒకరినుండిఒకరికి ఏవిధంగా సోకుతుందోతెలుసుకోండి.
కరోనాకు కష్టకాలం రావాలంటే, దేశమంతా ఏకం కావాలి. ఒక వ్యక్తి తలచుకుంటే భగవానున్ని ప్రత్యక్షం చేసుకోవచ్చును. మరి దేశమంతా తలచుకుంటే కరోనాకు కనిపించకుండా పోతుంది. శుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలతో బాటు కూడలిలోకి రాకుండా ఇంటికే పరిమితమై ఉండడానికి తయారు కావాల్సిన తరుణం ఇప్పుడే.

ధన్యవాదాలు---

Sunday, March 8, 2020

2017నుండి ఐపిఎల్ ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ టీమ్

ఐపిఎల్2020 సీజన్ ఈనెలనుండే ప్రారంభం కానుంది. ఈ నెలాఖారున ప్రారంభం కానున్న ఐపిఎల్2020 సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కవచ్చును. గతఐపిఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ కు దక్కింది. వార్నర్ 692 రన్స్ చేసి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ ఐపిల్2020 సీజన్ కు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో?

డేవిడ్ వార్నర్ టి20 అంతర్జాతీయ మ్యాచులలో 581 పరుగులు సాధించి ఉన్నాడు. అయితే ఇదే ఫార్మట్లో లోకేశ్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇతను 823 పరుగులు సాధించి, టి20లో టాప్ ఈ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. ఫించ్ టి20 మ్యాచులలో 820 పరుగులు సాధించి టాప్3టి20 బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. ఆ తర్వాత కొలిన్ మున్రో, మ్యాక్స్ వెల్, డేవిడ్ మాలన్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. రోహిత్ శర్మ టి20 మ్యాచులలో 662 పరుగులు సాధించి ఉన్నాడు. విరాట్ కోహ్లి టి20 మ్యాచులలో 673 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్స్ టి20 మ్యాచులలో 584 పరుగులు సాధించి ఉన్నాడు. వరల్డ్ టి20లో ఎక్కువ పరుగులు సాధించి ఉన్నారు.అయితే ఐపిఎల్ మ్యాచులు పూర్తిగా ఇండియాలో జరుగుతుండంతో ఎవరు ఎలా ఆడతారో చెప్పలేం. కానీ లోకేశ్ రాహుల్ (KXIP), ఫించ్(RCB), మున్రో, మ్యాక్స్ వెల్, రోహిత్ శర్మ(MI), విరాట్ కోహ్లి(RCB), కేన్ విలియమ్స్(SRH), శిఖర్ ధావన్(DC), హార్దిక్ పాండ్య(MI), ఎంఎస్ ధోని(CSK), డికాక్(MI), అండ్రూ రసెల్(KKR), శ్రేయాస్ అయర్(DC), డివిలియర్స్(RCB), స్ట్రోక్స్(RR), షేన్ వాట్సన్(CSK) వీరంతా విద్వంసకరమైన బ్యాటింగ్ చేయగలరు. మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించగలరు. వీరిలో ఎవరూ పుల్ ఫామ్ ఆడితే ఆ టీమ్ ప్లేఆఫ్ కు చేరినట్టే.

2017నుండి ఐపిఎల్ ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ టీమ్ సభ్యులలోనే ఉంటుంది. ఈ సారీ కూడా అదే కంటిన్యూ అవుతుందో లేక వేరే టీమ్ సభ్యులు సాధిస్తారో? చూడాలి.

ధన్యవాదాలు...


రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్

డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్

డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్

Saturday, March 7, 2020

చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్.

ముంబై వాంఖైడ్ స్టేడియంలో చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫోర్లతో స్టేడియం చుట్టూ బంతిని పంపించిన సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ పార్టనర్ షిప్. రిటైరైనవారు మరలా ఇండియా తరపున ఆడడం ఏమిటి? అనుకుంటున్నారా? రోడ్ సేఫ్టిపై అవగాహన పెంచేందుకు నిధుల సమీకరణకు మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్వహిస్తున్న లెజండరీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ టీమ్ తో శనివారం తలపడింది.లెజండరీ టి2020 వరల్డ్ సిరీస్ లో ఆరంభ మ్యాచులో వెస్టిండీస్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసి, 20ఓవర్లలో 150 పరుగులు చేసింది. చందర్ పాల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ ఉంటే, భారత బౌలింగ్ లో ప్రజ్ఙాన్ ఓజా, జహీర్ ఖాన్,  మునాఫ్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టార్గెట్ చేదించింది. ఇందులో సెహ్వాగ్ 11 ఫోర్లతో 57 బంతుల్లో 74 పరుగులు చేస్తే, సచిన్ టెండుల్కర్ 29బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు. వీరిద్దరి బ్యాటింగ్ స్టేడియంలో అందరినీ అలరించింది.

ఈ సిరీస్ లో భాగంగా భారత్ జట్టు మంగళవారం శ్రీలంకతో ఆడనుంది. ఇంకా ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా మ్యాచులు ఆడనున్నాయి. పాత ఆటగాళ్ల సొగసైన ఆటను ఈ లెజండరీ టి20 సిరీస్ లో చూడవచ్చును.

ధన్యవాదాలు

మహిళాదినోత్సవం సంధర్బంగా స్పూర్తిదాయకమైన మహిళకు

మహిళలు దేశప్రధాని అయినా అమ్మ కడుపులో నుండే ఈ భూమిమీదకు రావాలి. కూలీవారు అయినా అమ్మ కడుపులో ఆయుష్సు పోసుకోవాలి. బిడ్డను కనే అమ్మాయి అయినా అమ్మ కడుపులోంచే భూమిపైకి రావాలి. ఎవరైనా ఒక స్త్రీమూర్తి ప్రాణంతో పోరాడితే, పురుడుపోసుకుంటారు. అటువంటి మాతృమూర్తుల రోజు ఈ రోజు మహిళాదినోత్సవం. మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంప్రదాయం అంటే గౌరవం పెరిగిందంటే, అది మన భారతీయ మహిళల గొప్పతనంగానే చెబుతారు. మన ట్రెడిషనల్ మహిళల తీరు అంతర్జాతీయంగా ఆదర్శప్రాయం. చాలామంది మహిళలు కూడా మన భారతీయ ట్రెడిషన్ వస్త్రధారణతో మీడియాలో కనబడడం జరిగింది.

మహిళలు బిడ్డలు విషయంలో చూపే శ్రద్ద, ఇంకా ఎవరూ ఎక్కడ చూపించలేరు. బిడ్డను కనడానికే ప్రాణాలతో పోరాడతారు. పిల్లలు పెరగడానికి తల్లి చేసిన సేవ ఎవరూ చేయలేరు. ఇంకా పిల్లలకు మంచి బుద్దుల వచ్చాయంటే, దానికి ఆ బిడ్డ తల్లి చెప్పిన మాటలే మూలం అవుతాయి. ఇందుకు చత్రపతి శివాజీనే ఉదాహరణగా చెబుతారు. మహిళలు సమాజ అభివృద్దికి ఆ విధంగా సాయపడతారు.

సమాజానికి మంచి బుద్దులు కలిగినవారిని అందించడమే కాకుండా సమాజంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతను కూడా వారు పోషించడం జరుగుతుంది. మహిళలు అమ్మాయిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా ఎప్పుడూ ఇంట్లో సేవ చేస్తూ, సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా కుటుంబ స్థితిని బట్టి ఆర్ధిక బాధ్యతను తీసుకునే మహిళలు స్పూర్తిదాయకంగా ఉంటున్నారు.

క్రీడలలోనూ, రాజకీయాలలోనూ, వ్యాపార రంగంలోనూ వివిధ రంగాలలో మహిళలు రాణిస్తూ, తోటి మహిళలకు స్పూర్తి అవుతున్నారు. నరేంద్రమోదీగారు స్పూర్తిదాయకమైన మహిళకు, మహిళాదినోత్సవం సందర్బంగా కానుకను ఇవ్వనున్నారు.

అదే ప్రధాని మోదీగారు మహిళాదినోత్సవం సంధర్బంగా స్పూర్తిదాయకమైన మహిళకు తన సోషల్ మీడియా ఖాతాల బాధ్యతను ఇవ్వనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీగారు మహిళలకు ఇస్తున్న గౌరవం. ఈ సందర్భంగా రుచి శర్మ స్పూర్తిదాయకమైన మహిళగా ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించారు. ఆమె మహిళాదినోత్సవం సందర్భంగా మోదీగారి సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిప్రాయాలు షేర్ చేయనున్నారు.

మహిళలు ఇంట్లో ఉండి కుటుంబ బాధ్యతను నెరవేరిస్తేనే ఒక రకంగా సామాజిక సేవ చేసినట్టే. అయినా వారు ఆర్ధికపరమైన బాధ్యతను కూడా కుటుంబం కోసం తీసుకోవడం మరింత సేవ చేస్తున్నారు. అయితే అటువంటి మహిళలపై కొందరు దుండగులు మహిళలపై ఆకృత్యాలు, ఘోరాలు తపెట్టడం బాధాకరం.

ధన్యవాదాలు ....

చేతితో చేయి కలపడం కాదు నమస్కారం చేయాలి

చేతితో చేయి కలపడం కాదు నమస్కారం చేయాలి, ఇప్పుడు ఇదే ట్రెండ్. నమస్కారం పెట్టడం ఎప్పటి నుండో వస్తున్న భారతీయ సంప్రదాయం. ఒక వేళ ఆసంప్రదాయం మరిచిపోతే, మరలా ప్రారంభించవలసిన సమయం ఇదే. ఎవరినైనా కలిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అందరికీ అలవాటు అయ్యింది. కానీ ఇదే కరోనా వ్యాపించే అవకాశం ఉండడంతో దీనికి ప్రపంచం అంతా స్వస్తి చెప్పాలని ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. 

నమస్కారం పెట్టడం భారతీయ సంప్రదాయంలో వ్యక్తిలోని దైవానికి పెట్టడమే. దీని వలన నష్టం ఏం లేదు. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది అలవాటు అయ్యింది. అయితే ఈ అలవాటు వలన ఎవరికైనా అంటురోగం ఉంటే, అది మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వైద్యులు కూడా షేక్ హ్యాండ్ విధానం మంచిది కాదని చెబుతూ ఉంటారు.కరోనా వ్యాప్తి వలన చాలామంది షేక్ హ్యాండ్ విధానానికి స్వస్తి పలకమని చెబుతూ వచ్చారు. ఇదే విషయం ఇప్పుడు భారత ప్రధాని మోదీగారు కూడా వ్యాఖ్యానించారు. కరోనాపై వదంతులు నమ్మవద్దని, షేక్ హ్యాండ్ ఇవ్వడం కన్నా నమస్తే చెప్పడం మేలని అన్నారు. జన ఔషది ప్రయోజన పధకం లబ్దిదారులతో మాట్లాడిన మోదీగారు నమస్కారం పెట్టడం మన సంప్రదాయం అని. ఒకవేళ మరిచిపోతే మరలా ప్రారంభించమని వ్యాఖ్యానించారు.

సనాతన సంప్రదాయంలో పలకరింపులో నమస్కారం మంచి స్పందనను తీసుకువస్తుంది. ఇటువంటి సంప్రదాయం వలన అంటురోగాలు వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఇప్పటి సమయంలో కరోనాకు వ్యతిరేకంగా ప్రవర్తించడంలో కూడా కరచాలనం చేయడమే మేలు అంటారు.

ప్రస్తుత పరిస్థితులా రిత్యా చేతితో చేయి కలపడం కాదు, నమస్కారం చేయాలి అనే మాటను అందరూ తీసుకోవాలి. కరోనాను అడ్డుకోవడంలో ఇది ఒక చర్యగా చెబుతారు.

ధన్యవాదాలు ....

స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి-జనసేన స్థానిక బలం

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేష్ విడుదల అయ్యింది. మార్చి 9, 2020 నుండి మార్చి 11, 2020 వరకు ఎంపిటిసీ, జడ్పిటిసీ ఎన్నికలకు నామినేషన్స్ స్వీకరిస్తారు. మార్చి 12, 2020 తేదీన వాటిని పరిశీలిస్తారు. మార్చి 14, 2020 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 21, 2020 తేదీన ఎంపిటిసీ, జడ్పిటిసీ లకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 24న ఓట్ల లెక్కింపు. ఇంక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 23, 2020న ఫలితాలు మార్చి 27, 2020న ప్రకటిస్తారు.

పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు తొలిదశలో మార్చి 17, 2020 నుండి మార్చి 19, 2020 వరకు స్వీకరిస్తారు. మార్చి 27, 2020 తేదిన తొలిదశ పంచాయితీ ఎన్నికలు ఉంటాయి, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. రెండవదశలో మార్చి 19, 2020 నుండి మార్చి 21, 2020 తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండవదశ పంచాయితీ ఎన్నికలు మార్చి 29, 2020తేదీన ఉంటాయి, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది.పై విధంగా స్థానిక సంస్థల ఎన్నికల జరగనుంది. ఈ సారీ ఈ ఎన్నికల పోటీలో వైసిపి, టిడిపి, బిజెపి - జనసేన పార్టీలు పోటీ చేయనున్నాయి. వైసిపి అధికారంలో ఉంది. టిడిపి ప్రతిపక్షంలో ఉంది. వైసిపికి, టిడిపికి నాయకత్వంతో బాటు రాష్ట్ర నాయకత్వం బలం. అయితే బిజెపి-జనసేన విషయంలో పాపులారిటి బాగా ఉంది. స్థానికంగా పట్టు ఎంతమాత్రం వరకు అనేది చూస్తే గతంలో విడివిడిగా పోటీ చేసిన బిజెపి - జనసేన ఓటింగ్ శాతం చాలా తక్కువ.

పార్టీ అధినేత, అగ్రనాయకులు పాపులారిటీ ఓటింగ్ ట్రెండును ప్రభావితం చేస్తే, స్థానిక కార్యకర్తల కార్యాచరణ ఓటర్లను ఆకర్శించడంలో చేసిన కృషి పార్టీల గెలుపుకు దోహదపడతాయి. మరి స్థానిక సంస్థలలో ఆయా లోకల్ లీడర్సే ప్రధానం. పార్టీపై అభిమానం, అగ్రనాయకత్వంపై అభిమానంతో బాటు లోకల్ లీడర్స్ ప్రభావం స్థానిక సంస్థలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల స్థానిక బలంతో పాటు బిజెపి-జనసేన స్థానిక బలం పెరగాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానం.

Friday, March 6, 2020

గూగుల్ వచ్చింది బ్రాండ్ మారింది

గూగుల్ వచ్చింది బ్రాండ్ మారింది. అవును, ఇంటర్నెట్లో యాహూ కంపెనీ ఉండగా, గూగుల్ సెర్చ్ వచ్చింది. గూగుల్లో ఏదైనా వెతుకులాట తేలిక. అందుకే అందరికీ గూగుల్ అలవాటు అయ్యింది. ఎస్60 ఓఎస్ నోకియా ఫోన్లలో మ్యాప్స్ మరియు నావిగేషర్ రావడం అరుదు. గూగుల్ వచ్చింది, ఎర్త్ నెట్లోకి వచ్చింది. ఇలా చాలా రంగాలలోకి గూగుల్ వస్తూ ఉంటే, అప్పటికి బ్రాండుగా ఉన్నవి పోయి కొత్తవి బ్రాండ్లుగా మారాయి.బ్లాక్ బెర్రి బెస్ట్ ప్రీమియం బ్రాండెడ్ ఫోన్ అయితే, ఆండ్రాయిడ్ వచ్చాక అది మారింది. బడ్జెట్ ఫోన్లలో నోకియా నెం-1 గా ఉంటే, ఆండ్రాయిడ్ వచ్చాక సామ్సంగ్ టాప్ లోకి వచ్చింది. సామ్సంగా తరువాత ఎంఐ, వివో, ఒప్పో, రియల్ మి తదితర ఫోన్లు బారత్ మార్కెట్లోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం దేనికి సపోర్ట్ ఇస్తే అందులో ఆండ్రాయిడ్ ఓఎస్ వాడిన కంపెనీ ముందుగా మార్కెట్లో ప్రాచుర్యం పొందుతుంది.

ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారితంగా పని చేసేవి ఫోన్లే కాకుండా టివిలు కూడా పనిచేస్తున్నాయి. టివిలకు ఆండ్రాయిడ్ ఓఎస్ అందుబాటులోకి వచ్చేసరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ విభాగంలో ఉన్న బ్రాండ్లు కూడా టివిలను అందిస్తున్నాయి. అది తక్కువ ధరలోనే ఎల్ఇడి టివిలను అందిస్తుండడం విశేషం.

గూగుల్ ఆండ్రాయిడ్ ఏ విభాగంలోకి అందుబాటులోకి వస్తే, ఆ వస్తువులు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటాయి. వాటిలో ప్రీమియం, బడ్జెట్ ధరలలో వివిధ బ్రాండ్లు పోటీ పడుతూ ఉంటాయి. ఒక్కోసారి పాతవి పోయి కొత్త బ్రాండ్లు పరిచయం అవుతాయి. ఇలా గూగుల్ ఆండ్రాయిడ్ టెక్నికల్ గాడ్జెట్లలో తన హవా కొనసాగిస్తుంది.

ధన్యవాదాలు .....


Thursday, March 5, 2020

ఒన్ నేషన్ ఒక రేషన్ కార్డుపై స్పందన

ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ విధానం దేశంలో అమలు కానుంది. ఇప్పటివరకు రాష్ట్రాల ప్రకారం వేరు వేరు ఫార్మట్లలో రేషన్ కార్డులు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు దేశం అంతా ఒకటే ఫార్మట్లో రేషన్ కార్డు ఉండేలా చూస్తున్నారు.

ఈ సంవత్సరం జూన్‌ నెలకల్లా దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానం చేస్తారు. ఈ విధానంతో కొత్త రేషన్ కార్డులు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలను ఆదేశించింది. అందువలన 2020 జూన్ నెల నుండి కొత్త ఫార్మట్లో రేషన్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం వలన రేషన్ కార్డు హోల్డర్ దేశంలో ఏ రాష్ట్రానికి నివాసం మార్చినా, రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

కొత్త రేషన్ కార్డులు వచ్చాక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వృత్తిరిత్యా బదిలీ అయ్యేవారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఇతర రాష్ట్రాలలో మరలా రేషన్ కార్డు కొత్తగా అప్లయ్ చేయాల్సివచ్చేంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త విధానం వలన ఈ సమస్య తీరుతుంది.

గతంలో మోదీ ప్రభుత్వం ఒన్ నేషన్ ఒన్ టాక్స్ అంటూ కొన్ని విధానాలపై విమర్శించిన వారుసైతం, ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానాన్ని స్వాగతిస్తున్నారు. ఈ విధానం ఉపయోగకరం, ఎక్కువమందికి లబ్ది చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రింది వీడియో చూడండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒన్ నేషన్ ఒక రేషన్ కార్డుపై స్పందన.

ధన్యవాదాలు ....

మనిషికి ముఖ్యమైన ఆత్మవిచారణ గురువుల మాటల ద్వారానే

మనిషికి ముఖ్యమైన ఆత్మవిచారణ గురువుల మాటల ద్వారానే మొదలవుతుందని అంటారు.  ఆత్మవిచారణ అవసరం అయితే మనసుకు ప్రశాంతత ముందు అవసరం. గోల చేసే మనసుకు, గురువుల మాట స్పీడు బ్రేకర్ వంటిది. గురువుల మాట, మనిషికి మేలు అంటారు.

సినిమాలు విషయాలను మనసులోకి తీసుకువెళతాయి. అందుకే సినీ నటులకు అందరు అభిమానులు ఉంటారు. సినీ నటుల మాటతీరు, వేషధారణ, వారి శైలి ప్రేక్షకులపై పడుతుంది. ముఖ్యంగా యువత ఈ పోకడను పట్టించుకుంటారు. అలా సినిమాలు మనిషిపై మరింత ప్రభావం చూపుతాయి. ఇక సినిమా హీరోలు పబ్లిసిటీతో కూడా మార్కెటింగ్ సాగుతుంది.

సినిమాలలో నటించే నటులు చెబితే ఆలోచించడం యువతకు ఉంటుంది. అందుకే మార్కెటింగులో సినీ నటులతో ప్రకటనలు ఉంటాయి. ఇది ఎప్పటి నుండో ఉన్న ట్రెండు. కానీ నేటి ట్రెండు సినీ నటులతో మంచి మాటలు ముచ్చట్లు. సాదారణం ప్రవచనకారులు ప్రవచించిన మాటలు భక్తులకు చేరుతాయి. వయస్సుమీరినవారు వింటారు. అయితే యువతలో అందరూ వినే అవకాశం తక్కువగా ఉండవచ్చును.

బహుశా ఈ కారణమో ఏమో సినీ నటుల ముచ్చటిస్తూ మంచి మాటలు యువతకు చేరేలా చేస్తున్నారు. సద్గురు తెలుగు యూట్యూబ్ చానల్ వారు. యూత్ ట్రూతూ పేరిట సద్గురు చాలా ప్రసంగాలలో యవతతో కనెక్టు అవుతున్నారు. ఇంకా సద్గురు సినీ నటులు ప్రశ్నావళికి సమాధానమిస్తుండడంతో, ఆ మాటలు మరింతమందికి చేరుతున్నాయి. వివిధ ప్రముఖులు సద్గురుతో సంభాషిస్తూ ప్రశ్నలు అడుగుతుంటే, సద్గురు సమాధానాలు ఇస్తున్నారు. ఇలా మన తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్స్, సినీ ప్రముఖులు ఉన్నారు.

తెలుగు సినిమా హీరో నాని సద్గురుతో సాగించిన సంభాషణ, నాని అడిగిన ప్రశ్నలు, సద్గురు సమాధానాలు ఈ క్రింది వీడియలో చూడండి.

మనసుకు గురువుల మాటలు మేలును చేస్తాయి. వారి మాటలలో ఆంతర్యం అర్ధం చేసుకోవడానికి మనసుకు అలవాటుపడితే, అటువంటి మాటలు వినడంలో ఉత్సుకతను చూపుతుంది. మనిషికి ముఖ్యమైన ఆత్మవిచారణ గురువుల మాటల ద్వారానే ప్రారంభం అవుతుందంటారు.
ధన్యవాదాలు .....

మాటలతో మనసునొచ్చుకుంటే పాటలతో సరి

మాటలతో మనసునొచ్చుకుంటే పాటలతో సరిపెట్టుకోవడమే అంటారు. మనం మాట్లాడినప్పుడు తెలియక ఎదుటివారు మనసు నొప్పిస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఆ అనుభవం మనకు ఎదురుకావచ్చును. సభ్య సమాజంలో పొరపాటునా కానీ కావాలని కానీ మనసు నొప్పంపబడడం సహజం అయితే ఆ మాటలు మరవడానికి మ్యూజిక్ వినడం మాములే అంటారు.

మ్యూజిక్ వినడం వలన మనసుకు కొంత స్వాంతన చేకూరుతుంది అంటారు. ఏకాంతంగా మంచి మ్యూజిక్ వినడం ద్వారా మనసు కుదుటపడడం ఉంటుందని అంటారు. ఈరోజుల్లో ఫోన్లలో మ్యూజిక్ ఫ్రీగా వస్తుంది. ఇంకా ఇంటర్నెట్ బ్యాలెన్స్ కూడా చవకగానే ఉంది. కాబట్టి మంచి మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా వినేయవచ్చును.

మాటతోముప్పు పొంచి ఉంటుంది. మాటపై ఎంత నియంత్రణ ఉన్నా కాలంలో కష్టం కలిగించే మాట ఎవరోఒకరు వైపు నుండి వస్తుంది. లేక ఎవరి ప్రవర్తన అయినా అలా ఉండవచ్చును. అప్పుడు మంచి మ్యూజిక్ లేదా మంచి మెలోడి పాటలు వినడం ద్వారా మనసుకు స్వస్థత వస్తుందంటారు. కలత చెందిన మనసు మరింత ఆలోచనలోకి వెళితే, త్వరగా తేరుకోదు. అందుకని కొందరు ఏదో ఒక వ్యాపకంతోదాని దారిని మళ్ళిస్తారు. అందులో ఒక మార్గం మ్యూజిక్ వినడం అంటారు.

మంచి మెలోడి తెలుగు పాటలు మనకు ఎన్నో యూట్యూబ్ ద్వారా లభిస్తాయి. శ్రీ శ్రీనివాసం అంటూ సాగే సుస్వాగతం ఎంట్రీ సాంగుతో క్రింది వీడియోలో మెలోడీ సాంగ్స్ వినేయండి.

తీరికకు సరైన సమయం ఉంటే, ఇంకా మెడిటేషన్ మ్యూజిక్ మరింత మేలు అంటారు. మెడిటేషన్ సాధన చేయడం ఒక మంచి అలవాటుగా చెబుతారు. దీని ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు అని అంటారు. సాధనలో మనసు మాట వినదు, కానీ సాధన పెరిగే కొలది మనసు మెడిటేషన్ కు అలవాటు పడుతుందని అంటారు. అలా మనసును దారికి తెచ్చుకునే మంచి మార్గములలో మెడిటేషన్ మేలు అంటారు. మెడిటేషన్ అలవాటు కావడానికి మెడిటేషన్ మ్యూజిక్ కూడా ఉపయోగం. ఈ క్రింది వీడియోలో మెడిటేషన్ మ్యూజిక్ ఉంది. చూడండి.


ప్రవర్తనన లేక మాటలతో మనసునొచ్చుకుంటే పాటలతో సరిచేసుకోవడం, మనసుకు మేలు. మెడిటేషన్ మ్యూజిక్ మరింత మేలు.
ధన్యవాదాలు .....

కరచాలనం కన్నా నమస్కారం మిన్న అన్న విషయం

కరోనా కలకలం మనకు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా పాకుతున్న కరోనా ఇండియాలోకి, తెలుగు రాష్ట్రాలలోకి కూడా వచ్చేసింది. కరోనా కలిగిన దేశియులు విదేశాల నుండి రావడంతో కరోనా ఇక్కడ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే కరోనా గాలి ద్వారా సోకదు, కరచాలనంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ అంటున్నారు.

ప్రాణాంతకమైన వ్యాధి సోకకుండానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కరోనా వైరస్ కు మందులేదు. మందు లేనివ్యాధికి నియంత్రణ ఉండదు. అయితే మన వాతావరణంలో అంత కరోనా వైరస్ కు అనుకూలం కాదు. కానీ వైరస్ సోకిన వ్యక్తినుండి వ్యక్తి సోకే అవకాశం ఎక్కువ.  కాబట్టి ఆ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. అందుకు తగ్గట్టు సామాజిక పరిస్థితులు కూడా ఉండాలి.

కరోనా కలిగిన వ్యక్తులు సమాజంలో తిరుగుతున్నారు. కాబట్టి కరోనా వైరస్ వ్యాధి తగ్గేవరకు వ్యవస్థలకు కూడా సెలవులు ఉంటే బాగుంటదనే వెంకటకృష్ణ విశ్లేషణ వీడియో చూడండి.కరచాలనం కన్నా నమస్కారం మిన్న అన్న విషయం సనాతనంగా భారతీయులు చెప్పేది. కరచాలనంతో మరొక మనిషి చేతితో చేయి కలపడం కానీ నమస్కారం ఎదుటి మనిషిలోని ఆత్మారాముడికి పెట్టేది. కరచాలన మనకు కూడా అలవాటుగా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ అలవాటును కరోనా వలన తగ్గించుకోవాలసిందే. కరోనా రాకుండా కరచాలనం చేయకుండా నమస్కారం చేయడం ఒక రెమెడీగా ఉంది.

ధన్యవాదాలు ....

Wednesday, March 4, 2020

నేటి సినిమా ట్రెండ్ నాటి పరిస్థితులు నాటి కధాంశాలతో

ఒకప్పటి సినిమాల ట్రెండులో హీరో ఇంట్లో వారి మాట వినకపోవడం ఉండేది. తర్వాత పెద్దల మాట వినడంగా మారింది. ఇప్పుడు గతానికి వెళ్లడంగా మారుతుంది. గత చరిత్ర ఆధారంగా గతకాలాన్ని మనకు వెండితెరపై చూపించడం నేటి ట్రెండుగా మారుతుంది.

ఈ దిశలో ఇప్పటికే మనకు మగధీర ఒకప్పటి క్షత్రియ వీరులను గుర్తు చేస్తూ వచ్చింది. బాహుబలి ఒకప్పటి క్షత్రియులలో రాజకీయ కుట్ర, వీరోచిత యుద్దాలను చూపింది. అలా రాజమౌళి గతకాలాన్ని మనకు వెండితెరపై చూపించారు. అలాగే గుణశేఖర్ రామాయణం బాలలతో తీసి చూపారు. తర్వాత రుద్రమదేవి సినిమాలో నాటి పోరాటాలు చక్కగా చూపారు. గుణశేఖర్ సినిమాలు సాంఘికంగా ఉన్నా సంప్రదాయలను చూపుతూ ఉంటాయి. అల్లు అర్జున్ హీరోగా వరుడు సినిమా కూడా పాత పద్దతిలో పెళ్ళి చేసుకోవాలనే తపన కలిగిన యువకుడి కధగా తీసుకువచ్చారు.చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా అయితే బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు వెండితెరపై వెలిగాయి. నాటి పరిస్థితిలో మనం వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సైరా నరసింహారెడ్డి సినిమాను అంత చక్కగా సురేందర్ రెడ్డి తీర్చిదిద్దారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించి, తండ్రికి కానుకగా అందించారు. తెలుగు ప్రజల ఆధరణ కూడా అలాగే లభించింది, ఈ సినిమాకు.

మగధీర, బాహుబలి, రుద్రమదేవి, సైరా నరసింహారెడ్డి సినిమాలను ప్రేక్షకులు ఆధరించడంతో ఈ తరహా సినిమాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. గత చరిత్ర ఆధారంగా గతకాలాన్ని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతున్నారో, అంతే ఆసక్తి సినీ వర్గాలు కూడా చూపుతున్నాయి. ఈ తరహా భారీ సినిమాలకు ఊతమిచ్చిన రాజమౌళి మరలా తీసుకువస్తున్న భారీ సినిమా, ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాతో కూడా స్వాతంత్ర సమరం కాలంలోకి మనం వెళ్లవలసి ఉంటుంది. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను చూడగలం.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ సినిమా కూడా 1970 నాటి కాలం మనకు కనబడుతుంది. అప్పటి యూరప్ వాతావరణం ఈ సినిమాలో కనబడనుండి. ప్రభాస్ ఇప్పటికే మహారాజుగా మంచి మార్కులు సంపాదించారు.

పవన్ కళ్యాణ్ హీరో క్రిస్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కూడా చారిత్రక కధాంశంతోనే ఉంటుందని సమాచారం.

ఇలా నేటి సినిమా ట్రెండ్ నాటి పరిస్థితులు, నాటి కధాంశాలతో నిర్మాణం జరగడం విశేషం. చారిత్రకంగా భారతదేశంలో కధలకు కొరవ ఉండదు. కధనంలో పట్టు లేకపోవడం అంటూ ఉండదు. పెట్టుబడి పెట్టాలని కానీ ఆధ్యంతం ఆసక్తికరంగా సినిమాను తీయగలమని తెలుగు దర్శకులు నిరూపించారు. ఇంకా ఇటువంటి సినిమాలు నిర్మితమైతే, సమాజంలోకి గతకాలపు విలువల గురించి, నాటి పరిస్థితుల గురించి ఇప్పుడు పరిచయం అవుతుంది.

ధన్యవాదాలు .....

మూడు వన్డేల క్రికెట్ సిరీస్ కు కొత్త కెప్టెన్?

మూడు వన్డేల క్రికెట్ సిరీస్ కు కొత్త కెప్టెన్?

న్యూజిలాండ్ సిరిస్ ఓటమితో ముగించిన టీమిండియా ఈ నెలలో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నెల 12వ తేదీ నుండి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలలో టీమిండియా తలపడనుంది. ఫస్ట్ వన్డే 12న ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సెకండ్ వన్డే 15న లక్నోలో ఏకనా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. థర్డ్ వన్డే 18న కోల్ కతాలో ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.

విరామం లేకుండా విరాట్ కోహ్లి క్రికెట్ ఆడుతుండడంతో, అతనికి విశ్రాంతి లభించనుంది. ఒకవేళ కోహ్లి విరామం తీసుకుంటే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండకపోవచ్చును. అతను ఇప్పటికే గాయంతో న్యూజిలాండ్ సిరీస్ నుండి అప్పటికప్పుడు తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉండవచ్చును. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండా టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాల్సిన పరిస్థితి సెలక్టర్లకు తప్పేటట్టులేదు.దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కు కొత్త కెప్టెన్ సెలక్ట్ చేయాలంటే ముగ్గురు రేసులో ఉండవచ్చును. ఒకరు ఓపెనర్ శిఖర్ ధావన్. ఇతను సీనియర్ ఆటగాడు. గతంలో ఐపిఎల్ టీమ్స్ కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇంకా ఇండియా-ఎ క్రికెట్ టీమ్ కు కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉంది.

ఇక రెండవ ఆటగాడు లోకేష్ రాహుల్, ఇతను మంచి ఫామ్ లో ఉన్నాడు. అంతేకాక న్యూజిలాండ్ సిరీస్లో ఆఖిరి టి20 మ్యాచుకు నాయకత్వం వహించి, ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐపిఎల్2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కు సారధ్య బాధ్యతను చేపట్టనున్నాడు. మూడవ ఆటగాడు, అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పటికే ఐపిఎల్లో డిల్లి కేపిటల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు.

కొహ్లికి విశ్రాంతినిస్తే, రోహిత్ అందుబాటులో లేకపోతే ఈ ముగ్గురిలో అనుభవం పెద్దపీటగా చూసుకుంటే, శిఖర్ ధావన్ కు అవకాశం అందవచ్చును. లేకపోతే మిగిలిన ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అందవచ్చును.

భారత్ కు రానున్న దక్షిణాఫ్రికా జట్టు: క్వింట‌న్ డికాక్ (కెప్టెన్‌), టెంబా బ‌వుమా, ర‌స్సీ వాన్ డ‌ర్ డ‌స్సెన్‌, డుప్లెసిస్‌, కైలీ వెర్రేన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, జాన్ స్మ‌ట్స్‌, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూర‌న్ హెండ్రిక్స్‌, ఆన్రిచ్ నోర్జ్‌, జార్జ్ లిండే, కేశ‌వ్ మ‌హారాజ్‌.

ధన్యవాదాలు ....

Tuesday, March 3, 2020

పంచాయితీ, మండల పరిషత్ ఎన్నికలు

పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు నెల రోజులలోపులో ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు.

మున్సిపల్, జిల్లాపరిషత్, మండల పరిషత్, పంచాయితీ ఎన్నికలు స్థానికంగా ప్రజలకు దగ్గరగా ఉండే పాలనా వ్యవస్థ. పంచాయితీ ప్రెసిడెంటుగా ఎన్నికైన అభ్యర్ధి, మండలన్ పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన అభ్యర్ధి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే వారు స్థానికులై అక్కడే నివాసం ఉండే అవకాశం ఎక్కువ.
పాలన వ్యవస్ధ కూడా స్థానికంగానే గ్రామాలలోనూ మండలాలోనే కాబట్టి వీరు అందుబాటులో ఉంటారు.

స్థానిక ఎన్నికలలో గెలిచిన వారి వలన సార్వత్రిక ఎన్నికలలో కూడా వీరు ప్రభావం చూపగలరు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అయితే పార్టీ నాయకత్వం బట్టి ఓటింగ్ సరళి ఉండవచ్చును. కానీ స్థానికంగా అంటే స్థానిక నాయకుడి వ్యక్తిత్వం బట్టే ఓటింగ్ సరళి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసే అభ్యర్ధి తమకు తెలిసిన వారై ఉంటారు. ప్రజల మద్య మెసిలినవారే ఉంటారు. కాబట్టి స్థానికంగా పంచాయితీ, మండల పరిషత్ అభ్యర్ధులు అందరికి తెలిసినవారే ఎక్కువగా ఉంటారు. కొందరికి బాగా ముఖపరిచయం కూడా ఉంటుంది.

ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారు నాయకులై ఉంటే, ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ధన్యవాదాలు

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది?

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది? 

మనపై మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది? ఈప్రశ్న వినగానే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఎంతో విశ్వాసంగా మాటలు చెబుతున్న ఈ రోజుల్లో అటువంటి ప్రశ్న హాస్యాస్పదమే. అయితే ఒక వ్యక్తి పుట్టుకతోనే అతని కుటుంబాన్ని బట్టి సంఘంలో స్థితి ఏర్పడుతుంది. ఆస్థితి తగినంత హోదాను కూడా తీసుకువస్తుంది.


బాగా డబ్బు, పలకుబడి ఉన్నవారి పిల్లలను సరదాగా ఆటపట్టించడం కూడా కొందరు చేయరు. అక్కడే ఆ పిల్లవానికి చొరవ, ఉత్సాహం ఎక్కువ అవుతాయి. బాగా గారబం ఉంటే, అటువంటి పిల్లల మాటలకు అదుపు కూడా ఉండదు. ఈ విధంగా పుట్టుకతోనే ఉండే కుటుంబ పరిస్థితులతో ఎవరికివారికే తగినంత విశ్వాసం ఉంటుంది. చేస్తున్న పనులలో స్థైర్యం ఉంటుంది. ఏ పనినైనా విశ్వాసంతో చేయగలడం సాదారణమే.

అయితే తన స్థాయిని దాటి తలపెట్టిన పనులలో మాత్రం మనిషికి నమ్మకం తగ్గే అవకాశం లేకపోదంటారు. ఒక మద్యతరగతి స్టూడెంట్, ఐఏఎస్ కావాలంటే, దానికి తగ్గట్టుగా అతను చేయాలి. అతని సంకల్పాన్ని ప్రొత్సహించేవారు ఉండాలి. ఆ చదువుకు తగ్గట్టుగా మెటీరీయల్ అందుబాటులో ఉండాలి. ఇవ్వన్ని కూడ గట్టుకునే విషయంలో ఎవరైనా 'ఓరేయ్... మీనాన్న సంపాధన అంతంత మాత్రమే, నీకెందుకురా... పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటావ్... ఈ వయస్సులో మీ నాన్నకు సాయం ఉండాలి. కానీ అతనికి భారమైతే ఎలా ?' అన్ని ప్రశ్నించేవారు కూడా ఉంటారు. కొందరైతే 'నీ మొఖానికి ఐఏఎస్ కావాలా? ఐఏఎస్ పాసయ్యే మొఖమేనా? ' అని నిరుత్సాహపరిచేవారు ఉండవచ్చును. ఇలాంటి పరిస్థితులలో తనపైతనకు నమ్మకం తగ్గే అవకాశాలు ఉంటాయి.

సాదారణంగా తన చుట్టూ ఉన్నవారు తనలాగానే ఉండడం చూసి సంతోషంగా ఉంటారు. తనకన్నా బాగున్నా సంతోషించేవారుంటారు. అయితే అందనిదేదో సాధించాలన్నప్పుడే నిరుత్సాహభరితమైన మాటలు చెవిన పడుతూ ఉంటాయి. అలా అందనిది సాధించినవారిని ఒక ఉదాహరణగా చూపించినా అది వారి అదృష్టంగా చెబుతారు. కానీ కృషి చేస్తే సాధించవచ్చును. అనేది మాటలకు ఊతమిచ్చే విధంగా వ్యక్తికి తోడ్పాటు తొందరగా దొరకదు.

అందుకే ఏదైనా ఇంతకుముంద తమ చుట్టూ ఉన్నవారు సాధించనిది సాధించాలంటే మాత్రం తనపై అపనమ్మకం కలిగించే ప్రదేశానికి దూరంగా ఉండడమే ఉత్తమం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో స్వయంకృషితో ఎదిగిన స్టార్. అతను సినిమాలో క్యారెక్టరుగా వచ్చి, విలనుగా నటించి, హీరోగా మారాడు. డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ గా ఎదిగారు. అటువంటి చిరంజీవి కూడా కెరీర్ ప్రారంభంలో ఒక బజారుకే వెళ్లడం మానివేసినట్టుగా ఒక పత్రికకు చెప్పుకొచ్చారు. ఆ ముచ్చట చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఏదైనా సాధన మొదలుపెడితే, దానికి వ్యతిరేక మాటలు చెప్పేవారిని, లేక నిరుత్సాహపరిచేవారి వద్దకు ప్రారంభంలోనే వెళితే, సాధ్యం కూడా అసాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు ......

స్థానిక సంస్థలలో, ప్రలోభాల ఎరచూపకుండా ఎన్నికైతే

స్థానిక సంస్థలలో, ప్రలోభాల ఎరచూపకుండా ఎన్నికైతే

స్థానిక సంస్థల ఎన్నికలు నెల రోజులలోపులో పూర్తవ్వాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారలకు ఆదేశం. అధికారులతో ఆయన నిర్వహించిన సమీక్షలో ఆదేశించడం జరిగింది. అయితే ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే, ఎన్నికలు అయ్యాకైనా వారిపై చర్యలుంటాయి. మార్చి నెలలో జరగబోయే ఎంపీటీసి, జడ్పీటీసి, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో నగదు, మద్యం పూర్తిగా నిరోదించాలనే కొత్త ఆర్డినెన్స్ వచ్చింది.

ఒకవేళ ఎన్నికలలో మద్యం, నగదు పంపీణీ చేసినట్టు ఎన్నికల తరువాయి రుజువైతే, వారిపై అనర్హత వేటు ఉంటుంది. ఇంకా వారికి జైలు శిక్ష, పెనాల్టీ కూడా ఉంటుంది. గవర్నర్ కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ వలన ఎన్నికలలో అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోదానికి సంబంధించి ఒక యాప్ అందుబాటులో తేవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించనట్టు సమాచారం. ఇంకా ఈ మొబైల్ యాప్ పోలీసు మిత్రులు, మహిళా సచివాలయ మిత్రులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకు అందుబాటులో ఉంటుంది.

ప్రయత్నం వలన స్థానిక సంస్థలలో, ప్రలోభాల ఎరచూపకుండా ఎన్నికైతే, ఈ ప్రయత్నం దేశానికే ఆదర్శం అవుతుంది. ఏదైనా సమాజంలో ఎక్కువగా ప్రభావితం చేసేది. లోకల్ లీడర్సే. లోకల్ లీడర్స్ ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ విజయవంతం అయితే, సార్వత్రిక ఎన్నికలలో కూడా ఈ విధానం ప్రభావం చూపుతుంది. తద్వారా ఎన్నికలలో పాల్గొనే సభ్యులలో ఎక్కువ శాతం నిజాయితీ పరులే ఉంటారు. డబ్బు తీసుకోకుండా ఓటేసిన ఓటరు కూడా నాయకుల పనితీరును ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు .....

కొరటాల శివ సినిమాలలో సామాజిక సందేశం కూడా

కొరటాల శివ సినిమాలలో సామాజిక సందేశం

కొరటాల శివ సినిమాలలో సామాజిక సందేశం కూడా కలిసి ఉంటుంది. ఈ విషయం కొరటాల శివ సినిమాలు చూస్తే తెలియవస్తుంది. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఉన్నాయి. ఈ సినిమాలలో ఏదో ఒక సామాజిక సందేశం కలిసి ఉంటుంది.

మిర్చి సినిమాలో పగ ఉంటే మనిషి ఎలా ఉంటాడు. పగబట్టినవారికి అయినవారితో కూడా అలాగే ఉంటారు. ప్రేమించేవారు పగవారికి కూడా మేలు చేయాలనే సంకల్పం వస్తుంది. సంకల్పం సరైనోడికి వస్తే, అది నెరవేర్చేవరకు వదలడు. మిర్చి సినిమాలో ఇదే కనబడుతుంది. ఆవేశం కలిగిన కొడుకుకు తండ్రి ఆవేదన అర్ధం అయ్యి, తండ్రికోసం ప్రేమావతారం ఎత్తితే ఎలా ఉంటుందో అలాంటి పాత్రను ప్రభాస్ మిర్చి సినిమాలో పోషించాడు. దీనికి దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యింది. మిర్చి తెలుగు సినిమా దర్శకుడుగా కొరటాల శివకు తొలిసినిమా.

శ్రీమంతుడుగా మహేశ్ బాబు ఒదిగిపోయాడు. ఒక శ్రీమంతుడు బిడ్డగా రాజకుమారుడు ఎలా ఉంటాడో అలా ఉండకుండా ఏదో చేయాలి అనే ఆలోచనను కలిగి ఉండే పాత్రలో మహేశ్ బాబు నటించాడు. ఏదో చేయాలనే తపన ఉంటుంది, కానీ లక్ష్యం లేదు. అటువంటి యువకుడుకి, పరిచయమైన యువతి ద్వారానే తన లక్ష్యమేమిటో తెలియవస్తుంది. ఆ లక్ష్యం కోసం ఊరు వెళ్ళి, ఆ ఊరినే దత్తత తీసుకుని ఊరికి కావాలసివన్ని చేసి పెడతాడు. ఆ ఊరికి ఏదో చేయాలనే తపన తండ్రికి వస్తే, ఆ తపనకు పరిష్కారం కొడుకు అవుతాడు. ఒక శ్రీమంతుడు ఊరిని దత్తత తీసుకుని బాగుచేస్తే ఊరి ప్రజలు ఎంత సంతోషిస్తారో చూపుతూ ఈ సినిమా ఉంటుంది. ఒక మంచి సంకల్పం ఊరికోసం చేస్తే, అది ఎలాగైనా జరిగి తీరుతుంది. ఈ సినిమా ద్వారా సందేశం కనబడుతుంది. ఇది కొరటాల శివ దర్శకత్వం వహించిన రెండవ తెలుగుసినిమా.

కొరటాల శివ మూడవ సినిమా జనతా గ్యారేజ్. ఈ తెలుగుసినిమాలో మంచి సంకల్పం ఉన్నవారంతా ఒక చోటకే చేరతారనే సందేశం మనకు అందుతుంది. మోటారు వాహనాల రిపేర్ చేస్తూనే, పట్నంలో ఉండే పట్నవాసుల సమస్యలను కూడా పరిష్కరిస్తూ సమాజాన్ని రిపేరు చేసే పనిని పెట్టుకుంటారు, జనతా గ్యారేజ్ నిర్వాహకుడు. అయితే అందువలన అతని తమ్ముడు, తమ్ముడు భార్య మరణిస్తారు. తమ్ముడి బావమరిది వచ్చి, తమ్ముడి కొడుకుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. అలా దూరంగా వెళ్ళిన యువకుడు మొక్కలు, వృక్షాలు, ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడతాడు. అందులో భాగంగానే మరలా జనతా గ్యారేజ్ ఉన్న స్థానానికి వస్తాడు. అతను కూడా జనతా గ్యారేజ్ కార్యకలాపాలలో పాల్గొంటాడు. సమాజానికి మంచిచేయాలానే సంకల్పానికే కట్టుబడి ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్దపడతాడు.

రాజకీయాలలో ఉండే సమస్యల వలన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రజాసేవలో ప్రజల క్షేమం పట్టించుకోరు. అయితే ముఖ్యమంత్రి కొడుకు ఒక సిస్టంలో చదువుకుని వచ్చి, ఇక్కడ ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ సిస్టం ని ఎలా మారుస్తాడు. అనే కధాంశంతో భరత్ అను నేను ఉంటుంది. ఈ సినిమాతో మహేశ్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. ఇక్కడ సిస్టం కరెక్టుగా లేదు అనడానికి ట్రాఫిక్ సిస్టంపై ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులు కుడా పాటించకపోవడం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే, ప్రాణాలు కోల్పోతాం. ఈ ప్రాతిపదికన ప్రజావ్యతిరేకత వస్తుందని తెలిసినా, హై ఫైన్స్ విదించడం ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజా క్షేమంలో ప్రజల మేలుకొరకు ఎటువంటి చిత్తశుద్ది ఉండాలనేది, ఈ సినిమాలో కనబడుతుంది.

ఈ నాలుగు సినిమాలలోనూ కొరటాల శివ ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. సందేశం కలిగి ఉన్నా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సందేశం, వినోదం కలిపి అందించే ఈనాటి దర్శకులలో కొరటాల శివ స్టైల్ వేరు. ఇప్పుడు కొరటాల శివ, చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఒక నక్సలైట్ అని న్యూస్. అలాగే ఈ సినిమా పేరు ఆచార్య అని కూడా న్యూస్. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఏ మెగా సందేశం ఇస్తారో... చూడాలి.

ధన్యవాదాలు .......

Monday, March 2, 2020

కరోనా వైరస్ ఇండియా

కరోనా వైరస్ ఇండియా

కరోనా వైరస్ ఇండియా కు వచ్చేసింది. అంటే ఆందోళన వస్తుంది. ఆ వెంటనే వైరస్ లక్షణాలు తెలుసుకోవాలి. అనవసర అనుమానలకు తావివ్వకూడదు. సందేహం ఉంటే డాక్టరును కలవడం, టెస్ట చేయించుకోవడం. ఎందుకంటే కరోనా వైరస్ కు ఆధునిక మందులు ఇంకా లేవు. ఇది ప్రాణాంతక వ్యాధి అన్న ప్రచారం ఊపందుకొని ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి.

చైనాలోపుట్టిన కరోనా వైరస్ పలువురి మరణానికి కారణమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ రాకపోకలలో కరోనా వైరస్ గురించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయిను వైరస్ హస్తినకు వచ్చింది. వైరస్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం, భయమొద్దు. పుకార్లు నమ్మవద్దు అంటూ ప్రకటనలు వెలువడుతున్నాయి.

ఇండియాలో హస్తినకు రావడమే కాదు. తెలంగాణలో హైదరాబాదుకు కరోనా బాధ తగిలింది. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు కొవిడ్-19 నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆందోళన చెందనవసరం లేదు హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. కరోనా వైరస్ గురించి వివరాల కోసం, సలహాల కోసం  040 24651119 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయవచ్చును.

కేంద్ర ఆరోగ్య శాఖ 24గంటల కరోనా వైరస్ కు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు హెల్ప్ లైన్ నెంబరు 91-11-23978046 అందుబాటులో ఉంది. కొవిడ్-19 కు సంబంధించిన సందేహాల కోసం, సలహాల కోసం ఈ నెంబరు ఫోన్ చేయవచ్చును.ఇంకా ఈ మహమ్మారి నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలి? దానిపై జాగ్రత్తలను సూచిస్తూ ఒక పిడిఎఫ్ ఫైల్ కూడా తెలుగులో అందుబాటులో ఉంది.  కరోనా వైరస్ సోకే అవకాశాన్ని తగ్గించుకోండి. క్రింది జాగ్రత్తలను పాటించండి అంటూ ఈ ఫైల్ మీకు సూచనలను తెలియజేస్తుంది. ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేసి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇండియాలో ఆత్మవిశ్వాసం అధికం. అలాగే పుకార్లకు బలం ఎక్కువ. పుకార్లను పట్టించుకోకుండా, వాస్తవం తెలుసుకున్న ఏ భారతీయుడుకైనా పరిష్కారం లభిస్తుంది.

ధన్యవాదాలు ---

నో మోదీ ఇన్ సోషల్ మీడియా ట్రెండింగ్ న్యూస్

నో మోదీ ఇన్ సోషల్ మీడియా ట్రెండింగ్ న్యూస్

మీడియాలో సోషల్ మీడియా వేగంగా వ్యాప్తి చెందే మీడియా. సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడింగ్ చాలా స్పీడుగా ఉంటుంది. అందుకేనేమో మోదీ సోషల్ మీడియా ద్వారా కూడా దేశ ప్రజలతో కనెక్టు అవుతూ వచ్చారు. అత్యంత ఎక్కువమంది ఫాల్లోవర్స్ ట్విట్టర్లో 5.33 కోట్లమంది, ఫేస్ బుక్లో 4.4 కోట్లమంది, ఇన్ స్టాగ్రాంలో 3.52 కోట్లమంది ప్రధానమంత్రి మోదీని ఫాలో చేస్తున్నారు.

అయితే అకస్మాత్తుగా ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాను వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ ఆదివారం నుండి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ ఖాతాలను విరమించుకునే ఆలోచన ఉన్నట్టుగా ట్వీట్ చేశారు. ట్విట్టర్లో ట్వీట్ ద్వారా ఈ విషయం చెప్పగానే #NoModiNoTwitter #IwillAlsoLeaveTwitter అంటూ హ్యాష్ ట్యాగ్స్ ప్రారంభమయ్యాయి. మోదీ సోషల్ మీడియాలో ఉండాలనే భావనను వెల్లడి అవుతుంది.

గతంలో మూడుమార్లు ఆకస్మిక నిర్ణయాలను ప్రత్యక్షంగా ప్రజలతోనే ప్రకటించి మోదీ మీడియాను, లోకాన్ని ఆశ్చర్యపరిచారు. ఎవరికి ఏవిధమైన సమాచారం అందించకుండా ఈవిధంగా మోదీ నిర్ణయాలను దేశప్రజలకు ప్రత్యక్షంగా ప్రకటించడం ప్రధాని స్థాయిలో మోదీగారికే చెల్లింది. ఎటువంటి న్యూస్ నిమషాలలో స్ప్రెడ్ అయ్యే సోషల్ మీడియాను వదిలేయడం అంటే, అది ఆశ్చర్యకరమైన విషయమే. అందులోనూ రాజకీయాలలో ఉండి, రాజకీయంగా ప్రచారం చాలా కీలకం. అయినను హస్తిన నుండి దేశాన్ని పాలించే నేత, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది.

సోషల్ మీడియాను మోదీ వీడతారనే వార్తపై రాజకీయంగా వ్యాఖ్యలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ ఎంపి శశీ థరూర్ కీలక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాను నిషేదించేందుకు, ఇది ముందస్తు చర్యగా భావిస్తున్నట్టుగా ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

అయితే ప్రధానమంత్రి మోదీ ఈ ఆదివారం నుండి సోషల్ మీడియాను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రకటించారు. కానీ ఆరోజు ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ ఒక మహిళకు అప్పగించనున్నారట. ఒక్కరోజు ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్కౌంటుల బాధ్యతను స్పూర్తిధాయకమైన మహిళకు అప్పగిస్తారు. అయితే ఇందుకోసం మహిళలు స్పూర్తిధాయకమైన కధనాన్ని ట్విట్టర్ #SheInspierU ట్యాగుకు కధనాలను పంపించాలి. లేక వీడియో కధనం అయితే యూట్యూబ్ కు పంపించాలి. అలా పంపబడిన వాటిలో ఎంపికచేసిన వారికి ప్రధాని సోషల్ మీడియా ఖాతాలను బాధ్యతను ఒక్కరోజు నిమిత్తం అప్పగిస్తారు.

ధన్యవాదాలు

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. గత రెండేళ్ళగా పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఙాతవాసి తెలుగుసినిమాలో నటించారు. అటుపై జనసేన కార్యక్రమములతో రాజకీయాలలో బిజిగా ఉన్నారు. ప్రజల మద్యే ఉంటూ, వెండితెరకు రెండేళ్ళనుండి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుండడంతో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేసింది.ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ టాగ్ అయ్యింది.

ఈ పవన్ కళ్యాణ్ సందేశాత్మక సినిమాకి వకీల్ సాబ్ గా టైటిల్ ఖరారు చేశారు.
వృద్దులకు పెన్షన్ గుమ్మం ముందుకే వస్తుంది.

వృద్దులకు పెన్షన్ గుమ్మం ముందుకే వస్తుంది.

వృద్దులకు పెన్షన్ గుమ్మం ముందుకే వస్తుంది. గతంలో వృద్దులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే అది ఇప్పుడు ఇంటికే వస్తుంది. ఇంటిముందుకే పెన్షన్ రావడం వృద్దులకు ఇబ్బందిని తొలగించినట్టే అవుతుంది. ఎందుకంటే పెన్షన్ తీసుకునేవారిలో నడవలేని వృద్దులు ఉంటారు. ఇంకా ఎక్కువసేపు నిలబడలేని వృద్దులు కూడా ఉంటారు.

ఇలా నడవలేనివారిక, ఎక్కువ సమయం నిలబడలేనివారికి పెన్షన్ ఆఫీసుకు వెళ్ళి తీసుకోవడం అంటే అది ఇబ్బందికరమే. అందులోనూ వందలమందికి పెన్షన్ ఇచ్చే వ్యక్తికి కూడా అది ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వైసిపి ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటివద్దకే పంపిస్తున్నారు. ఇకపై వృద్దులు పెన్షన్ కోసం పంచాయితీకి వెళ్ళి నిలబడాల్సిన కష్టం వైసిపి ప్రభుత్వం తప్పించింది.

ముఖ్యమంత్రిగారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని అంటున్న వెంకటకృష్ణగారు... ఈ క్రింది వీడియోలో...జాతీయంగా నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకం, ప్రాంతీయంగా లేదా?

జాతీయంగా నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకం, ప్రాంతీయంగా లేదా?

2014కు ముందువరకు కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలదే పాలన. భాజపా మద్యలో కొంతకాలం పరిపాలన చేసినా, కేంద్రంలో పూర్తిస్థాయి పాలనే కాంగ్రెస్ పార్టీదే ఉండేది. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధాని ఎవరు? రాహుల్ గాందీ లేక నరేంద్ర మోదీ. 2014 ఎన్నికలలో నరేంద్రమోదీ ప్రసంగాలు, అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ పాలన. నరేంద్రమోదీ మాటలను ప్రజలు నమ్మారు. బాజపా మరియు మిత్రపక్షాలకు పూర్తి స్థాయి మెజారిటి ఇచ్చారు. దేశం మొత్తం మోదీ హవా నడిచింది.

కానీ 2016 పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ విధానం రెండు విషయాల్లోనూ మోదీ పాలనపై పలు విమర్శలు వచ్చాయి. తరువాత 2017 పలు రాష్ట్రాలలో జరిగిన కొన్ని ఎన్నికలలో బాజపా గెలిచింది, కొన్నింటిలో ఓటమి పాలైంది. 2018లో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అప్పటికి అధికారంలో ఉన్న రాజస్థాన్, మద్యప్రదేశ్, చత్తీస్ గర్ రాష్ట్రాలలో ఓటమి పాలైంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం భాజపా గతం కంటే ఎక్కువ సీట్లు సాధించింది. అప్పటికే పెద్ద నోట్లరద్దు, జిఎస్టీ అమలులో విమర్శలు పాలైన ప్రభుత్వం, అందరిని ఆశ్చర్యరుస్తూ గతం కంటే మెరుగైన ఫలితాలను రాబట్టింది.

2018లో రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భాజపా ఆశించిన ఫలితాలు పొందలేదు. కానీ 2019లో పార్లమెంటు ఎన్నికలలో విజయదుందుభి మ్రోగించింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే, ప్రాంతీయంగా భాజపాపై ప్రజల నమ్మకం ఎలా ఉన్నా? జాతీయస్థాయిలో మాత్రం భాజపా నాయకత్వంపై భరోసా బాగుంది. మోదీపై నమ్మకం జాతీయపరంగా ప్రజలలో పోలేదు. ప్రాంతీయంగా కులం, లోకల్ లీడర్స్ ప్రభావం ప్రజలపై ఉంటుంది. కానీ జాతీయస్థాయిలో మోదీ కన్నా బెటర్ అనిపించే నాయకుడు కనబడలేదు.

పెద్దనోట్ల రద్దువలన ప్రతి సామాన్యుడు, సామన్య వ్యాపారవేత్త కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాదారణంగా ప్రతిపక్షాలు పెద్దపెట్టున కార్యాచరణ చేయనవసరం లేకుండానే దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రభావం ప్రజలకు తెలిసి వచ్చింది. అయినను నరేంద్రమోదీనే మరలా ప్రధానిగా దేశప్రజలంతా నమ్మారు.

మోదీ నమ్మించారా? ప్రజలు నమ్మారా? 2014లో నరేంద్రమోదీ ప్రసంగాలే ఆకట్టుకున్నాయి. కానీ 2019కి వచ్చేటప్పటికి పెద్దనోట్ల రద్దుతోనే వ్యతిరేకత మూటగట్టుకుని మోదీ ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు. అయినను ప్రజలు ఆయననే నమ్మారు. మరి ఈ నమ్మకం 2024కు ఎలా ఉంటుందో? చూడాలి. ప్రాంతీయంగా మోదీపై నమ్మకం పెరుగుతుందా? లేక జాతీయంగా భాజపాకు, రాష్ట్రాలవారీగా లోకల్ పార్టీలకే పట్టు పెరుగుతుందో చూడాలి.

గత రాజకీయాలను పరిశీలిస్తే, దేశ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ మొదటగా రాష్ట్రాలలో అధికారం కోల్పోతూ వచ్చింది. రాష్ట్రాలలో కాంగ్రెస్ హవా తగ్గుతూ, ప్రాంతీయపార్టీల హవా పెరుగుతూ వస్తే, జాతీయం భాజపా బలం పెంచుకుంటూ వచ్చింది. చివరకు 2014 కాంగ్రెస్ ఎన్నడూ లేనంతగా ఓటమి పాలు అయ్యింది. కాంగ్రెస్ 2018లో మరలా కొన్ని రాష్ట్రాలలో పుంజుకుంది. కానీ 2019లో పూర్తిగా బోల్తాపడింది. 2024నాటికి కాంగ్రెస్ ను ఏవిధంగా రాహుల్ గాందీ నడుపుతారో... చూడాలి.

ధన్యవాదాలు -----

ఈ విషయం వెండితెరపై చూపించిన సినిమా తొలిప్రేమ

ఈ విషయం వెండితెరపై చూపించిన సినిమా తొలిప్రేమ

ప్రేమ జీవితంలో ఒక భాగం కానీ ప్రేమే జీవితం కాదు. నిజమైన ప్రేమలో ఒకరి గురించి మరొకరికి తపన ఉంటుంది. కానీ తమ స్వార్ధం గురించిన ఆలోచనే ఉండదు. ఈ విషయం వెండితెరపై చూపించిన సినిమా తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా నటించిన ఈ సినిమా. ప్రేమకధా సినిమాలలో ఒక ట్రెండును క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర బాలు చుట్టూనే కధంతా తిరగడం ఉంటుంది. బాలు అమ్మాయిని చూడగానే ప్రేమిస్తాడు. బాలు పరధ్యానంలోకి వెళతాడు. ఆ విషయం స్నేహితులు గుర్తించి, అది ప్రేమగా డిక్లేర్ చేస్తారు. అయితే బాలు ప్రేమించిన అమ్మాయి హైక్లాస్, ఆ అమ్మాయి బాలుకు దక్కదని, స్నేహితులు నిరుత్సాహపరుస్తారు.

కానీ టెంపుల్ సీనులో బాలుని వెతుక్కుంటూ, ఆ అమ్మాయి రావడం ఆసక్తిగా ఉంటుంది. మరొకసారి బాలు ఆటోగ్రాఫ్ కోసం అదే అమ్మాయి బాలుని వెంబడించడం మరింత ఆసక్తిగా ఉంటుంది. తనకు దొరకదు అని నిరుత్సాహపడుతున్న బాలుకు కారులో లిప్ట్ ఇస్తుంది. ఆ కారు యాక్సిడెంట్ అయ్యి ఆమె లోయలోకి పడిపోతుండగా, బాలు ఆమెను కాపాడి, తను లోయలో పడిపోతాడు. ఇది ఇంటర్వెల్ సీన్.

ఆ తర్వాత ఆ అమ్మాయే బాలు ఇల్లును వెతుక్కుంటూ, రావడం, ఆమెతో స్నేహం చేయడం జరుగుతుంది. ఆమె స్నేహం  వలన బాలుకి, జీవితం అంటే ఒక లక్ష్యసిద్దికోసం పాటుపడడం అని అర్ధం అవుతుంది. అదేమి మనకు ఏ సీన్లోను వివరించరు. కానీ బాలు ఆమెతో స్నేహం చేయడం, బాలు చెల్లి పెళ్లి, అతని ఫ్రెండ్స్ ఈ సీన్లతో సినిమా క్లయిమాక్స్ కు చేరుతుంది. ఎక్కడా బాలు తన ప్రేమ విషయం ఆమెతో చెప్పడు. ఆమె ఆశయం గుర్తించిన అతను ఆమెను అమెరికాకు పంపించడానికి ఎయిర్ పోర్టుకు వస్తాడు. స్నేహితులు, బంధువులు ఎవరూ తన ప్రేమవిషయం ఆమెకు తెలియజేయకుండా జాగ్రత్త పడతాడు. ఎప్పుడూ తింటే తండ్రి కూడా కొడుకు హృదయం తెలుసుకుని పొంగిపోతాడు.

ఎయిర్ పోర్టులో బాలుని విడిచి వెళుతున్న ఆమె, ప్రాణం వదిలి వెళుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. అంతే ఆమె అతడిని ప్రేమిస్తున్నట్టు ఆమెకు కూడా తెలియవస్తుంది. ఇదే విషయం బాలుతో చెప్పడం, బాలు ఆమె ఆశయాన్ని ఆమెకే గుర్తు చేసి, ఆమెను అమెరికా పంపడం జరుగుతుంది. ఈ క్లైమాక్స్ అద్భుతంగానే ఉంటుంది.

తొలిప్రేమ సినిమా గొప్పతనం. సిన్సియర్ లవ్ చేసిన అబ్బాయికి, అమ్మాయి కనెక్టు అవుతూనే ఉంటుంది. చివరకు ప్రేమిస్తున్న విషయం కూడా ఆమెనే అతనితో చెబుతుంది. కానీ జీవితాశాయానికి విలువనిచ్చిన అతని నిర్ణయం ప్రేక్షకులు హృదయానికి హత్తుకుంది.


ధన్యవాదాలు

Sunday, March 1, 2020

విదేశంలో స్వదేశి క్రికెటర్ల ఆట

విదేశంలో స్వదేశి క్రికెటర్ల ఆట

గతంలో బయటి దేశాలలో బారత క్రికెట్ జట్టు ఆట అంత అద్భుతంగా ఉండేది కాదంటారు. కానీ గత కొంత కాలంగా బారత క్రికెట్ జట్టు స్వదేశంలో మాదిరిగానే, విదేశాల్లోనూ నిలకడగా రాణించడం విశేషం. అయితే భారత క్రికెట్ జట్టు కొన్ని విదేశి సిరీస్ లలో ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది.టెస్ట్ సిరిస్లో ఎదురులేకుండా జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో...న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇండియన్ క్రికెట్ టీమ్ ఆటతీరు అభిమానులు ఆశించనంతగా లేదు. ప్రస్తుత పర్యటనలో ఇండియన్ క్రికెట్ టి20లో చూపిన ప్రతిభ, వన్డే ఇంటర్నేషనల్స్ లో చూపలేకపోయింది. దాంతో వన్డే సిరీస్ న్యూజిలాండ్ కైవసం అయ్యింది. ఇప్పుడు టెస్ట్ క్రికెట్లోనూ చూపలేకపోతుంది. మొదటి టెస్టులో ఘోరపరాభవం మూటగట్టుకుంది. రెండవ టెస్టులోనూ తక్కువ స్కోరుకు మొదటి ఇన్నింగ్స్ ముంగించింది.

టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఈవిధమైన ఆటను ప్రదర్శించడం గమనార్హం. భిన్నమైన వాతావరణ పరిస్థితులలో ఆడవలసి వచ్చినప్పుడు మన భారత ఆటగాళ్ళు ఆటతీరు మారుతుండడం విశేషం. అలవాటు అయిన వాతావరణంలో రాణించినంతగా, కొత్తవాతావరణంలో రాణించలేరనే వాదనకు భారత ఆటగాళ్ల ఆటతీరు బలం చేకూరుస్తుంది.

అయితే టి20 క్రికెట్లో బారత ఆటగాళ్ల మంచి విజయాలు సాధించి, తర్వాత వన్డే ఫార్మట్లో చతికిలపడడం విశేషం. అయిదురోజుల టెస్ట్ క్రికెట్ ఫార్మట్లో కూడా ఆటగాళ్ళ ఆట జట్టును తొలిటెస్టులో గెలిపించలేకపోయింది. ఇప్పుడు రెండవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యారు. మిగిలిన నాలుగు రోజులలో భారత ఆటగాళ్ళ ఆట ఆశించినంతగా లేదు. రెండో టెస్ట్ మ్యాచుకు బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదు. కానీ బ్యాటింగులో మాత్రం మనవారు తడబాటుకు గురయ్యారు.

కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఈ న్యూజిలాండ్ సిరీస్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. తక్కువ స్కోర్లకే అవుటవ్వడంతో భారత జట్టుకు బ్యాటింగ్ భారం పెరిగింది. ఒక సిరీస్ గెలిచి రెండు సిరీస్ లు ఓటమిపాలయ్యారు. టాస్ కీలకమైన విదేశి పర్యటనలో కోహ్లికి టాస్ కలిసిరాకపోవడం, మరింతగా బ్యాటింగ్ పై ప్రభావం చూపింది. భిన్న వాతావారణంలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి సమయం ఎక్కువ కావాలి. ఇంకా అందులోనూ టాస్ చాలా కీలకంగా మారుతుంది. పిచ్ పరిస్థితులను బట్టి బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలనే నిర్ణయం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లికి అవకాశం చిక్కలేదు.

ఈ భారత క్రికెట్ టీమ్ సారి విదేశి పర్యటన విజయవంతంగా ముగించలేదు.

ధన్యవాదాలు ----

పోలీసు టెంపరరీ డాక్టరుగా

పోలీసు టెంపరరీ డాక్టరుగా

న్యూస్ లో నైస్ న్యూస్ అంటే సామాజిక సంరక్షణకు వ్యవస్థాగతమైన చర్యలకు పూనుకోవడం. రోడ్డుపై వాహనాలు నడిపేవారికి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. రోడ్లపై వాహనదారులు అప్రమత్తతో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. ఇలా రోడ్డుపై ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురైన వ్యక్తులకు వెంటనే వైద్యం అందితే, అది వారికి తాత్కలిక ఉపశమనం కలుగుతుంది. పోలీసు టెంపరరీ డాక్టరుగా మరితే ఎలా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డవారికే పోలీసే టెంపరరీ డాక్టరు అయితే..

ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే ప్రాధమికి చికిత్స జరిగితే, వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే వెళ్ళేది పోలీసులే. రోడ్లపై జరిగే ప్రమాదాలకు వారు వెంటనే ప్రాధమిక చికిత్స అందిస్తే, ప్రమాదంపాలైన వ్యక్తికి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా ప్రాణాపాయ స్థితి తప్పుతుంది.

రోడ్డుపై వాహనాదారుడు సరిగ్గానే అప్రమత్తతో వాహనం నడిపినా, అతనికెదురుగా వచ్చేవారు కూడా అంతే అప్రమత్తతో ఉండాలి. అతని వెనుకాల వచ్చేవారు కూడా అప్రమత్తతో ఉండాలి. ఒత్తిడిలో వెళ్ళేవారికి ఇంకా అప్రమత్తత అవసరం. రోడ్డుపై ఎన్ని జరిగే ప్రమాదాలకు వెంటనే చికిత్స అందించడానికి వీలుగా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా అత్యవసర పరిస్థితులలో పోలీసులు ఎలా తాత్కలిక వైద్యులుగా మారుతున్నారో... చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు

బడి గుడి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది.

బడి గుడి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. 

బడి శుభ్రంగా ఉంటే, బడిలో పిల్లలకు ఆరోగ్యం. గుడి శుభ్రంగా ఉంటే, గుడిలో భక్తులకు ప్రశాంతత. బడిలో క్రమశిక్షణ అలవాటు అయితే పిల్లల ఎదుగుదల బాగుతుంది. గుడికి భక్తుడు ప్రశాంత చిత్తంతో భక్తులు గుడిలో ఉంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ప్రశాంతచిత్తులు ఎక్కువ అవ్వడంతో సమాజం ప్రశాంతంగా ఉంటుంది. బడిలో క్రమశిక్షణతో ఉండడం చేత, చదువు శ్రద్దగా వస్తుంది. శ్రద్దతో చదివిన చదువులు ఖచ్చితమైన ప్రమాణాలను కలిగి ఉంటుంది. బడి గుడి వ్యవస్థకు మంచి పునాది.

బడి బలమైన పునాది విద్యార్ధులకు ఇస్తుంది. బడిలో ముఖ్యంగా క్రమశిక్షణ, విద్య, ఆటలు కలిపి ఉంటాయి. ఆడుకునే వయస్సు. నేర్చుకునే వయస్సు. ఎదిగే వయస్సు. మూడింటికి ఒకటే కాలం. కానీ బలమైన పునాది పడే కాలం.

ప్రభుత్వ బడిలో చదువుకుంటే క్రమశిక్షణ కొరవడవచ్చు. కాబట్టి ప్రవేటు బడిలోకి పంపితే అనే తలంపు తలవగానే పెద్దలు క్రమశిక్షణకు పెద్దపీఠ వేస్తారు. గారం కొద్ది ఇప్పుడు మనమాట వినరు. అదే ప్రవేటు బడుల్లోకి పిల్లలను పంపితే, ముందుగా క్రమశిక్షణ అలవడుతుందనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకనే ప్రవేటు బడుల్లోకి తమ పిల్లలను పంపుతారు.

ప్రవేటు బడుల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారనే పేరుగల స్కూళ్ళలో పిల్లలను జాయిన్ చేస్తూ ఉంటారు. ఈ కారణం చేత ప్రవేటు బడుల్లో విద్యను నేర్పించడానికి తల్లిదండ్రులు ఎక్కువ డబ్బు ఖర్చు అయినా ప్రవేటు స్కూళ్ళకు తమ పిల్లలను పంపుతూ ఉంటారు. తత్ఫలితంగా ప్రవేటు బడులకు ఆదరణ ఎక్కువైందంటారు.

అయితే ఇప్పుడు ప్రవేటు బడులపై వినిపించే విమర్శ. మితిమీరుతున్న క్రమశిక్షణ అంటారు. ఎక్కువమంది ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలనే పోటీ పడే కొన్ని స్కూళ్ళల్లో మితిమీరిన క్రమశిక్షణ ఎక్కువ అవుతుందంటారు. అందులో ప్రధానంగా చదివించే సమయం. ఇది ఎంతలాగా అంటే ఉదయం నుండి రాత్రివరకు ఉండవచ్చును.

సాదారణంగా పిల్లలు ఉదయం వేళ, హుషారుగా లేచి, సాదరణ స్కూల్ సమయంలో బడికిపోయి చదువుకుని, సాయంకాలం సమయంలో కాసేపు ఆటలు ఆడుకుని రావడం ఉంటుంది. కానీ కొన్ని ప్రవేటు స్కూళ్ళల్లో గుడ్ విల్ కోసం పిల్లల సమయం హరించివేస్తున్నారనే విమర్శ వస్తుంది. సూర్యోదయం దగ్గరనుండి సూర్యాస్తమయం దాటి పిల్లలు స్కూళ్ళల్లోనే పరిమితం అయి చదువుకోవడం అంటే వారి ఆటల సమయం కూడా హరించుకుపోతుంది. ముఖ్యం పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఎంత పదవతరగతి అయినా పిల్లలకు బుద్దిపూర్వకంగా చదువుపై శ్రద్ధపెరగాలి కానీ అందరిపైనా అదే శ్రద్ధ రావాలని రోజులో పూర్తి సమయం అంతా బలవంతంగా కూర్చోబెట్టి చదివించడం ఒప్పు కాదంటారు.

ఇక మరొక సమస్య ప్రవేటు బడుల్లో చదువుకునే సామాగ్రి, ఆస్కూల్లోనే కొనుగోలు చేయాల్సి రావడం. ఏ స్కూల్ వారికి ఆ స్కూల్ యూనిఫాం ప్రత్యేకంగా ఉంటే, మిగిలిన బుక్స్ మరియు స్టేషనరీ ఆయా ప్రవేట్ స్కూల్లల్లోనే కొనుగోలు చేయాల్సిరావడం తల్లిదండ్రులకు భారం. దీని గురించి ఈనాడు ఆర్టికల్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఏదైనా మనకు బడి గుడి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అంటారు. బడి పిల్లలకు క్రమశిక్షణ, విద్యను, ఆటలను అందిస్తే, గుడి వ్యక్తికి ప్రశాంతతను తీసుకువస్తుంది. ఈ రెండింటిని నిర్వాహకులు సరిగ్గా నిర్వహించడం గొప్ప సమాజ సేవ.

ధన్యవాదాలు---

టెక్నికల్ గాడ్జెట్లకు యువత అలవాటు పడుతున్నారా...

టెక్నికల్ గాడ్జెట్లకు యువత అలవాటు పడుతున్నారా...

ఈ రోజుల్లో న్యూస్ విభాగంలో చాలామంది ఎదురు చూసేది టెక్ న్యూస్ కోసం. టెక్ న్యూస్ అందించే ప్రత్యేక వెబ్ సైట్లతో బాటు, స్మార్ట్ ఫోన్ల గురించి రివ్యూలు అందించే ప్రత్యేక టెక్ వెబ్ సైట్లు ఉండడం దీనిని రూఢి చేస్తుంది. ఇలా నేడు టెక్నికల్ గాడ్జెట్లకు యువత అలవాటు పడుతున్నారా...? అంటే అవును అనకతప్పదు.

టెక్నికల్ గాడ్జెట్లలో ఎక్కువగా స్మార్ట్ ఫోను, ట్యాబ్స్ యువత చేతిలో ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు అరచేతిలోనే ఉంటాయి. ముఖ్యంగా బాలురు అయితే గేమ్స్ ఆడడానికి అలవాటు పడుతున్నారు. బాల్యంలో గెంతుతూ, పరిగెడుతూ ఆటలు ఆడుకోవాలసినవారు, నేటి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ వలన ఒక చోట కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నారు. కొందరు అలా ఆటలకు అలవాటుపడుతున్నారు.

అన్నం తినడం అలవాటు అవ్వాలి. ఎందుకంటే శరీరంతో కష్టపడి పనిచేయాలి. కష్టం చేస్తేనే శరీరం బాగుంటుంది. కష్టపడడానికి శక్తి అన్నంతోనే వస్తుంది. కాబట్టి అది అలవాటుగా ఉంటుంది. అన్నం కూడా తినడం మానేసి, ఫోన్లలోనూ, ట్యాబుల్లోనూ గేములు ఆడుకోవడం నేటి వింతపోకడల్లో ఒకటి. ఏదో అలవాటు అయిందంటే అనుకోవచ్చు, ప్రాణాలు తీసుకోవలసినంతగా పోన్లు, ట్యాబ్స్ అలవాటు అవ్వడం అవాంఛనీయం.

ఇలా జరగకుండా ఉండడానికి, తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు అలవాటు చేయకూడదు. పెద్దవారు కూడా పిల్లల ముందు అదేపనిగా ఫోన్లు వాడకూడదు. పిల్లలు చెప్పింది వినడం కన్నా చేసేది చూసి నేర్చుకుంటారు. కాబట్టి పెద్దవారు పిల్లల ముందు ఫోన్ల వాడకుండా ఉండాలి. సమయం ఉంటే వారితో ఆడుకోవాలి. అప్పుడే పిల్లలు ఫోన్లకు అలవాటు పడరు.
ఈ క్రింది లింకు ద్వారా న్యూస్ చదవండి, ట్యాబ్ ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడట...
ట్యాబ్ కోసం తమ్ముడు ఆత్మహత్య

భగవద్గీత, మహాభారతం లాంటి తెలుగుబుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి

భగవద్గీత, మహాభారతం లాంటి తెలుగుబుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి

భగవద్గీత, మహాభారతం లాంటి తెలుగుబుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక వెబ్ సైట్ ఉంది. ఈ వెబ్ సైటులో ఫ్రీగా 3000 వేల బుక్స్ దాకా లభిస్తాయి. మీర ఈ వెబ్ సైటు నుండి ఫ్రీతెలుగుబుక్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఫ్రీ తెలుగుబుక్స్ ఉచితంగా చదువుకోవచ్చును.

భక్తియోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఙానయోగం, రామాయణం, మహాభారతం, భగవద్గీత, పురాణములు, భాగవతం, వేదములు, ఉప వేదాలు, వేదాంగాలు, ఉప వేదాంగాలు, ఉపనిషత్తులు, గీతలు, ధర్మము, కధలు, శతకాలు, సూక్తులు, కావ్యాలు, నాటకాలు, కీర్తనలు, గేయాలు, దేవీదేవతలు, గురువులు, భక్తులు, కవులు, జీవితచరిత్ర, మహిళలు, పిల్లలు, చరిత్ర, విజ్ఙానం, వ్యక్తిత్వ వికాసం అంటూ ఈ శీర్షికల పేర్లతో పలు పుస్తకాలు పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి.

ఫ్రీగురుకుల్.ఆర్గ్ అను ఆంగ్ల అక్షరాలతో మీరు ఈ వెబ్ సైటును గూగుల్ క్రోమ్, ఒపెరా, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లలో ఓపెన్ చేయవచ్చును. అక్కడ నుండి మీకు పైన చెప్పిన వర్గాలలో నుండి మీకు కావల్సిన తెలుగుఫ్రీపిడిఎఫ్ తెలుగుబుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

మీరు మొబైల్ ద్వారా అయితే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడు చేసుకుని వివిధ తెలుగుబుక్స్ చదువుకోవచ్చును. ఇంకా వీడియో, ఆడియో ప్రవచనాలు వినవచ్చును. ఇందులో ప్రాచీన, ఆధునిక విజ్ఙానం అందించే తెలుగుబుక్స్ ఉన్నాయి. పురాతన విషయాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఋషులు మొదలైన వారి గురించి అనేక బుక్స్ పురాణ పరిజ్ఙానాన్ని అందిస్తాయి.

స్వామి వివేకానంద మరియు ప్రఖ్యాత రచయిత రచనల తెలుగు బుక్స్ మీకు ఈ వెబ్ సైటు లేదా యాప్ నందు ఉచితంగా లభిస్తాయి. వివిధ ప్రవచనకారుల ప్రవచనాల వీడియోలు వీక్షించవచ్చును. ఇందులో లభించేదంతా ఫ్రీగానే ఉంది. ఉచిత గురుకుల విద్య పౌండేషన్ వారు అందిస్తున్నారు.

ఫ్రీగురుకుల్ వెబ్ సైటు సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఫ్రీగురుకుల్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ /క్లిక్ చేయండి

ధన్యవాదాలు...

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...