Saturday, February 29, 2020

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠం కావచ్చును. అయితే ఆ పాఠం మనకు ఎలా తెలుస్తుంది? అంటే టివిలలో వచ్చే చర్చా కార్యక్రమములో విశ్లేషకుల వివరణలు న్యూస్ ను ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దిన పత్రికలలో స్పెషల్ స్టోరీస్ పబ్లిష్ చేస్తూ ఉంటారు.

ఈరోజు న్యూస్ ఎంతమందిని ప్రభావితంచేస్తే, అంత త్వరగా ఆ న్యూస్ పైన చర్చా కార్యక్రమములు మొదలవుతాయి. అంత తొందరగా డైలీ పేపర్లలో కధనాలు వస్తూ ఉంటాయి. కధనం ఏదైనా మనలో న్యూస్ పై ఉన్న భావాన్ని ఇంకా బలపరుస్తాయి.

అయితే ఇప్పుడు వస్తున్న మీడియా కధనాలు ఏం చెబుతున్నాయి? అవి మనకు నచ్చిన విషయాలనే బలపరిస్తే, మనం న్యూస్ చూస్తూ టైంపాస్ చేస్తున్నట్టే. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఘటన జరిగినప్పుడు వచ్చిన న్యూస్ వాస్తవంగా ఉంటే, కధనం నిజాలను నిగ్గుతేలాలి అంటూ సాగుతుంది.న్యూస్ ఘటనను తెలియజేస్తే, కధనం ఘటనకు కారణం వెతుకుతుంది. న్యూస్ మనలో ఒక ఆలోచనను సృష్టిస్తే, కధనం న్యూస్ భావాన్ని మరింత బలపరుస్తుంది.

రాజకీయ నాయకుల నిర్ణయాలు, వాటి ప్రభావాలు అంటూ సాగే కధనాలను చదవడం వలన ప్రస్తుత రాజకీయ పరిస్థితి అవగాహన వస్తుంది. రాజకీయ పరిస్థితులపై, సామాజిక సమస్యలపై అందరికీ అవగాహన అవసరం. ఎందుకంటే ఎన్నికల వేళలో అప్పటికప్పటి ట్రెండును బట్టి, ఫలితాలు ప్రభావం అవుతూ ఉంటాయి. అయితే ఎక్కడైతే దీర్ఘకాలికంగా తమ సమస్యలపై అవగాహన ప్రజలందరిలోనూ అవగాహన ఏర్పడుతుందో, అప్పుడు అక్కడ ఆ సమస్య తీరేవరకు ప్రజలు ఆ సమస్యకు నాయకత్వం వహించిన నాయకుడికే పట్టం కడతారు.


ఉదాహరణకు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. 


తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడాలంటూ కె చంద్రశేఖరరావు చేసిన దీక్షలు, ఆయనతో బాటు కలసి వచ్చిన జేఏసి, అఖిల పక్ష రాజకీయ పార్టీల ఉద్యమాలు, అన్ని కలిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే పట్టుదలను ఎక్కువగా చూపింది. కె చంద్రశేఖరరావుగా కనబడడంతో, ప్రజలు కెసిఆర్ నోటిమాటపై ఎన్నికలలో ఇప్పటికి రెండుసార్లు గెలిపించారు. ఎందుకంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తెరగడంతో అందరూ రోడ్లపైకి వచ్చారు. తమకు నాయకత్వం వహించిన నాయకుడిని గెలిపిస్తున్నారు.

అంటే అందరికీ తమ తమ ప్రాంతీయ సమస్యలపై సరైన అవగాహన ఉంటే, ఆ సమస్యకు ఎవరైనా నాయకత్వం వహించినప్పుడు, ఆ సమస్యకు అందరి నుండి రెస్పాన్స్ తొందరగా వస్తుంది. తొందరగా రెస్పాన్స్ రావడం వలన అందరిలోనూ ఆ సమస్యపై ఐకమత్యం ఏర్పడుతుంది. తత్ఫలితం సమస్య సాధించబడుతుంది. అందుకనే న్యూస్ నుండి కధనం వరకు మనకు వాటిలో వాస్తవం కనబడాలి.

నేను ఒక్కడినే న్యూస్, కధనాలు అర్ధం చేసుకోకపోతే ఏమౌతుందిలే అనుకుంటే పొరపాటు. సమస్యపై ఎక్కువమంది స్పందించినప్పుడే, ఆ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది. ఎక్కువమందికి సమస్యకు స్పందించాలంటే, ఆ సమస్యపై అందరికీ అవగాహన అవసరం.ఒక్కరి సమస్యకు అతను, అతని చుట్టూ ఉన్నవారు పోరాడుతూ ఉంటారు. అయితే ఒక ప్రాంతానికి సమస్య ఉంటే, ఆ ప్రాంతంలోని వారందరికీ ఆ సమస్య తీవ్రత తెలుసుండాలి. ఆ సమస్య పరిష్కరించడం వలన మనకు, మన భవిష్యత్తు తరానికి జరగబోయే మేలు కూడా తెలుసుండాలి. అప్పుడే ఆ సమస్యపై అవగాహన అందరికి వస్తుంది. అందరిలో అవగాహన ఉన్నప్పుడు, ఆ సమస్యకు ఎవరైనా నాయకత్వం వహిస్తే, వెంటనే సమాజం నుండి స్పందన వస్తుంది. ఎక్కువ మంది స్పందిస్తే, సమస్య పరిష్కరించబడుతుంది.

సమస్య మనకు అర్ధంకాకుండా ఉన్నన్నాళ్లు ఆ సమస్య గురించి ఆలోచన రాదు. న్యూస్ మరియు కధనాలు, న్యూస్ మరియు చర్చలపై అవగాహన లేకుండా ఉంటే మన సమస్యలు మనకే అర్ధం కావు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పాల్గొన్నారంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అందరూ కోరుకున్నారు. ఫలితంగా అందరూ తీవ్రస్థాయిలో ఉద్యమించారు.

మన సామాజిక పరిస్థితులు,  మన సామాజిక సమస్యలపై మీడియా అందించే న్యూస్, వాటిలోనే వచ్చే కధనాలతో మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందరిలోనూ కనెక్ట్ అయ్యే సరికి సమయం పడుతుంది. వాస్తవంగా ఆ సమస్యలోని తీవ్రత ఎక్కువమందిని ఇబ్బంది పెడితే, సమస్యల సెగ మరింత వ్యాప్తి చెందుతుంది.

 న్యూస్ వ్యాప్తి చెందితే, కధనం కారణాన్ని ఎత్తి చూపుతుంది. న్యూస్ విని ఎనలైజ్ చేసుకుంటున్న మనకు దానిపై వచ్చిన కధనం మన ఎనలైజుని సపోర్ట్ చేస్తుంది. ఇది అందరిలోనూ వచ్చినప్పుడు దానిపై సమాజం ఏకధాటిగా స్పందిస్తుంది. చిన్న చిన్న సమస్యలకు వ్యవస్థ చూసుకుంటుంది. కానీ రాజకీయం ముడిపడి ఉన్నప్పుడు మాత్రం ఏకధాటిగా అందరి స్పందన ఒక్కటైనప్పుడే, సమస్య నుండి రాజకీయం విడివడి సమస్య ప్రధానంగా మారుతుంది. రాజకీయం లేని సమస్య పరిష్కారానికి దగ్గరవుతుంది.రాజకీయం సమస్యను పరిష్కారదిశగా నడిపించాలి కానీ రాజకీయం సమస్యను మరింత జఠిలం చేయకూడదు. నేటి న్యూస్, కధనాలు, చర్చలు, స్పెషల్ స్టోరీస్ చూడండి. నేటి సమస్యలకు రాజకీయం ఎలా పట్టుకుందో తెలియవస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయం అవసరం. కానీ సమస్యను దీర్ఘకాలికంగా సాగదీసే రాజకీయం నాయకుల మనుగడకే ముప్పు తీసుకువస్తుంది.

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా మారుతుంది. నాయకులకు ఎన్నికల వేళకు తెలియవస్తుంది. ప్రజలకు ప్రభుత్వ పాలనలో తెలియవస్తుంది. విధానం ప్రవాహం వంటిది, ప్రవాహం దిశ మారాలంటే విధానమునకు మూలమైన సామాజిక అవగాహన అవసరం. అందరిలోనూ విధానం దిశపై ఒక అవగాహన ఉంటే, అందరూ ఏది కోరుకుంటే, అదే జరుగుతుంది.

ధన్యవాదాలు

No comments:

Post a Comment

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...