Saturday, February 29, 2020

ఐపిఎల్2020 క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్

ఐపిఎల్2020 క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ 

నేటికాలంలో వస్తున్న న్యూస్ లో రాజకీయం ప్రధాన్యతతో కూడి ఉంటే, సినిమా న్యూస్ అందరిలోనూ ఆసిక్తిని పెంచుతాయి. ఆ తరువాత క్రికెట్ న్యూస్ అంటే అందరికీ ఆసక్తి. ఆపై ఐపిఎల్ సీజన్ వస్తే, సాయంవేళల్లో టివిలముందు క్రికెట్ లైవ్ చూడడానికే ఆసక్తి ఎక్కువ.స్మార్ట్ ఫోన్లు వచ్చాక క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండడంతో ఫోన్లలోనే ఐపిఎల్ కు మరింత ఆధరణ పెరిగింది. క్రికెట్ స్కోర్ అప్డేట్ అవుతూ ఉండడం, లైవ్ వీడియో స్ట్రీమింగ్ అందించే మొబైల్ యాప్స్ వచ్చాక, ఐపిఎల్ క్రికెట్ చూడడం ఇంకా తేలికయ్యింది.

ఎక్కువగా హాట్ స్టార్ లాంటి మొబైల్ యాప్స్ ద్వారా ఐపిఎల్ క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్ ఐపిఎల్ ద్వారా వీక్షించడానికి ఇయర్ ప్లాన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపిఎల్ 2020సీజన్ ఈ నెల 29 నుండి ప్రారంభం కానుంది.

వీడియో స్ట్రీమింగ్ కాకుండా కేవలం స్కోర్ స్ట్రీమింగ్ చూడడానికి అనేక వెబ్ సైటులు అందిస్తున్నాయి. బాల్ టు బాల్ స్కోర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. స్కోర్ కార్డులో టీమ్ స్కోర్, ప్లేయర్ స్కోర్ ఎప్పటికప్పుడు ఆటో అప్డేట్ అవుతూ ఉంటాయి.

ఐపిఎల్ 2020 సీజన్ టీమ్స్ 


చెన్నై సూపర్ కింగ్స్, డిల్లి కేపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ తలపడుతున్నాయి. ఒక్కో ఐపిఎల్ టీమ్ మిగిలిన టీమ్స్ అన్నింటితోనూ తమ సొంత గ్రౌండులో ఒక్కక్క మ్యాచ్ ఆడనున్నాయి. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సొంత గ్రౌండు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మిగిలిన టీమ్స్ అన్నింటితోనూ ఏడు మ్యాచులు ఆడుతుంది. అలాగే ఆయా టీమ్ గ్రౌండ్లలోనూ ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. ఈవిధంగా అన్ని ఐపిఎల్ టీమ్స్ 14 మ్యాచులు ఆడనున్నాయి.

2020 సీజన్ ఐపిఎల్ భాగంగా తొలిమ్యాచ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మద్య జరగనుంది. మార్చి 29, ఆదివారం 8-00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. వెబ్ ద్వారా హాట్ స్టార్, టివిలలో స్టార్ స్పోర్ట్స్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్స్..

ధన్యవాదాలు, న్యూస్-గీత


వారఫలం చూసి పనులు పురమాయించుకుని

వారఫలం చూసి పనులు పురమాయించుకుని,

పనులలో ఆటంకం కలగకుండా జాగ్రత్తపడటం పరిపాటి. ఎప్పటినుండో ఇండియాలో తిధి, వార, నక్షత్ర యోగములను చూసుకుని కొత్తపనులు ప్రారంభించడం అలవాటుగా ఉంది. కొత్తగా ఏపని ప్రారంభించినా మంచి మూహూర్తం చూసుకుని ప్రారంభిస్తారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో పనిచేసి, అందరిని అలరించే సినిమాలు అయితే మరీ మంచి మూహూర్తంలో ప్రారంభిస్తారు. ఇలా ఇండియాలో ఏదైనా కొత్త పనిని, కొత్తగా ప్రారంభించడానికి మూహూర్త బలం చూస్తారు. ఇక పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకు, వివిధ ఫంక్షన్లకు మూహూర్తం తప్పనిసరి.

సాంకేతిక పరిజ్ఙానం పెరిగాక, ఎటువంటి విజ్ఙానం అయినా ఫోన్లలో వీడియోలుగా వచ్చేస్తున్నాయి. అందులో పాత పద్దతులు, కొత్తగా వస్తున్న వింత పోకడలు, విశేషాలు ఇలా ప్రపంచంలో జరిగేవన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రజల అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా దినఫలితాలు, వారఫలితాలు, మాసఫలితాలు, రాశి ఫలితాలు అంటూ జాతక ప్రియులకోసం గ్రహచారా ఫలితాల వీడియోలు అనేకం.

ప్రతిరోజూ రాశిననుసరించి దినఫలితం ఏవిధంగా ఉందో, వీడియోలు ఉంటాయి. వారానికి ఏ రాశికి ఎలా ఉండబోతుందో వీడియోలు ఉంటాయి. రానున్న మాసంలో రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి గ్రహచార ఫలితాల వీడియోలు వస్తూ ఉంటాయి. ఇక ఉగాదికి సంవత్సరం మొత్తంగా ఏ రాశివారికి ఎలా ఉండబోతుందో గ్రహచార వీడియోలు వస్తూనే ఉంటాయి.

అయితే ఈ ఫలితాను ఎందుకు చూస్తున్నాం. ఒకవేళ ఒకవ్యక్తిది సింహరాశి. ఈవారం సింహరాశికి బాగాలేదు. ఏంచేయాలి? అనే ఆలోచన వస్తే... ఆవ్యక్తి ఆవారం అంతా పనిని సక్రమంగా చేయగలడా? మనసు కీడును సంకించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ అతను తన రాశిఫలితం వారం వారం చూస్తూనే ఉంటాడు.

గ్రహచార ఫలితాలు, కర్మను బట్టి ఉంటాయి. వ్యక్తి పుట్టినప్పుడే అతని గ్రహాచార పరిస్థితులను బట్టి జీవితం ఉంటుందని అంటారు. మరి జాతకం చూసుకుని ఏంచేస్తారు? అంటే జాగ్రత్తపడతారు అని సమాధానం చెబుతారు, జాతకపండితులు.

వారఫలితం చూసి ఆయా రాశులవారు గోచారం బాగున్నరాశివారు ఉత్సాహంగా ఉంటే, గోచారం బాగాలేని రాశివారు నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం బాగాలేని రాశి వారు తర్వాతి వారం బాగుంటుందనే భావనతో మరలా మనసు ఉత్సాహం పుంజుకుంటే, అదే తీరున ఈవారం బాగున్న రాశివారు తర్వాతి వారం బాగోదన్న భావన వస్తే...అప్పుడు వారఫలం ప్రయోజం ఏమిటి?

అయితే వారఫలం, మాసఫలం ముఖ్య ఉద్దేశ్యం అంటూ...


1. ఏదైనా రాశివారు నిర్ణయాలు ఆకస్మిక నిర్ణయం తీసుకునేటప్పుడు గోచార ఫలితం స్ఫురణలోకి వస్తే, నిర్ణయం ఆలోచించి తీసుకునే అవకాశం ఉంటుంది.
2. ఒకరు తనకు వ్యతిరేకం నిర్ణయం తీసుకున్నారు అని భావించిన వ్యక్తి, తన గోచార ఫలితం చూసుకుని, నిర్ణయం స్వాగతిస్తూ, ఎదుటివ్యక్తిపై కక్షతో కాకుండా, ఆలోచనతో వ్యవహరించే బుద్దిపుడుతుంది.
3. పనులు ప్రారంభంలోనే ఆగిపోవడంలోనూ గోచార ఫలితం గుర్తుకురాగానే, తను మరలా మంచి సమయం చూసుకుని పనిని ప్రారంభించాలనే నిశ్చయబుద్ది ఏర్పడుతుంది.
4. గోచార ఫలితం ఎక్కువ ప్రభావితం ఉన్నప్పుడు జాగ్రత్త వహించడం వలన ప్రమాద ప్రభావం తగ్గే విధంగా జాగ్రత్త వహించవచ్చును.
5. ఏదైనా పని మార్పిడి, స్థలమార్పిడి అనుకోకుండా చేయవలసి వచ్చినప్పుడు గోచార ఫలితం దృష్టిలో పెట్టుకుంటే, అనుకూలమైనా, ప్రతికూలమైనా మనసు ఎదుర్కోవడానికి సిద్దపడుతుంది.
ఈ విధంగా వారఫలాలు చూసుకుని గమనంతో వెళ్ళడం వలన పాజిటివ్ దృక్కోణం అలవరచుకోవచ్చని చెబుతారు. దు:ఖంలో ఇతరులను నిందించి విరోదం తెచ్చుకోకుండా, గోచార ఫలితం కారణం అని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రాగానే, తాను ఏనాడో చేసుకున్న ఫలితమో నేటికి అనుభవంలోకి వచ్చింది. అన్న ఆలోచన రాగానే ఆవేశపూరితమైన మనసు స్వాంతనకు వస్తుంది.

మనసు శాంతితో ఉండడం వలన పనులలో శ్రద్ద లోపించదు. శ్రద్దతో పనులు చేయడంతో కాలం కష్టంతో కూడిన ఫలితం బాగుంటుంది. అంటే వారఫలాలు, మాస ఫలాలు తగు జాగ్రత్తలతో తమ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తుల స్వభావాలు అంచనా వేసుకుని చూసుకుంటే, మనకో మంచి మార్గం చూపుతాయి. పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎప్పుడూ పరిస్థితులు ప్రతికూలంగా ఉండవు. కాలంతో స్థితి మారుతూనే ఉంటుంది. ఈ స్పృహ కలిగితే వారఫలం, మాసఫలం జాగ్రత్తను తెలియజేస్తూ, మేలునే చేస్తాయి.

వారఫలం చూసి పనులు పురమాయించుకుని ముందుకు సాగడానికి అవి సహాయపడతాయి.

ధన్యవాదాలు

నిరసనలు నిరసన తెలియజేయడానికే కానీ అరాచకం సృష్టించడానికి కాదు.

నిరసనలు నిరసన తెలియజేయడానికే కానీ అరాచకం సృష్టించడానికి కాదు.

ప్రజలకు కష్టం కలిగించే ప్రభుత్వం నిర్ణయాలపై నిరసనలు తెలియజేయాలి. కానీ అదే ప్రజలను ఇబ్బంది పెడుతూ, ప్రజలను రక్షించే వ్యవస్థపై దాడి చేయడం గర్హనీయం.

ప్రభుత్వం పని చేస్తేనే, ఆ ప్రభుత్వ పాలన ఉండే ప్రాంతాలు వృద్దిలోకి వస్తాయి. ఆ ప్రభుత్వ పాలనలో ఉండే సామజిక స్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వమును నడిపేది ఒక రాజకీయ పార్టీ కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలు ఏకపక్షంగా లేక రాజకీయ లబ్ధికోసమే ప్రభుత్వం పనిచేయకుండా, ప్రజల అవసరాలకోసం పనిచేసేవిధంగా ప్రతపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యంలో పరిపాటి.

ప్రభుత్వం ప్రజాభివృద్ధికి ప్రణాళికలు అమలు చేయడం, ప్రతిపక్షాలు దోషాలను ఎత్తిచూపడం. ఈ విధానాన్ని విశ్లేషకులు సమర్ధిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వంపై కక్షతో లేక ప్రాంతీయ బేధంతో కొందరు చేసే ఆరాచకపు పనులు అల్లర్లను సృష్టించడానికి ప్రజాస్వామ్య ముసుగులో చేయరాదు. ప్రభుత్వ విధానం ప్రజలకు నచ్చకపోతే, ప్రజల తరపున ప్రతిపక్షాలు, సామాజికవేత్తలు నాయకత్వం వహించి, ప్రభుత్వానికి నిరసనను తెలియజేస్తారు.

ప్రభుత్వ విధానపరమై నిర్ణయాలను నిరసించేవారు నిరసన తెలియజేయాడానికి ప్రజాస్వామ్యం పద్దతి ఉంది. ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయడం వలన అంటే ప్రభుత్వ వ్యవస్థను అడ్డుకోవడానికి కూడా ప్రజాస్వామ్యం పద్దతి దుర్వినియోగం అవుతుందా? ఈ క్రింది వీడియో విశ్లేషణ చూడండి....


పై వీడియోను వీక్షిస్తే, డిల్లీ అల్లర్లు కావాలని సృష్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా పై విశ్లేషన వాస్తవమైతే, అది ఏమాత్రం వాంఛనీయం కాదు. నిరసనలు నిరసన తెలియజేయడానికే కానీ అరాచకం సృష్టించడానికి కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, ప్రభుత్వ దృష్టికి నిరసనను తెలియజేయాలి. కానీ వ్యవస్థను దిగ్బంధం చేయడానికి కాదు.

ధన్యవాదాలు

ప్రాణత్యాగానికి సిద్దపడి అమ్మాయి, అమ్మ అయితే మనం కదా...

ప్రాణత్యాగానికి సిద్దపడి అమ్మాయి, అమ్మ అయితే మనం కదా...

మనం ఎక్కడ నుండి వచ్చాం అంటే, ప్రాణత్యాగానికి సిద్దపడి అమ్మాయి, అమ్మ అయితే మనం కదా...  మరి మన ప్రవర్తన అమ్మాయి పట్ల...

అమ్మ ప్రేమ అమృతం కన్నా మిన్న అంటారు. అటువంటి అమ్మతనం అమ్మాయితోనే ఉంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులను అలరించిన అమ్మాయి, ఎదిగాక వివాహంతో అమ్మగా మారిపోతుంది. చిన్నపిల్లగానే చూస్తూ, చూస్తూ అమ్మాయిలు పెద్దగా అయ్యి పెండ్లితో పెద్దవారిగా మారిపోతారు. చూస్తుండగానే పెద్దరికం వచ్చేస్తుంది. ఆడవారికి పెద్దరికం అంత తేలికగా అబ్బుతుంది. పెద్దవారిలో కలిసిపోతారు. కారణం అమ్మాయిలో ఉండే అమ్మతనం.

అమ్మతనం బిడ్డకు ప్రాణం పోస్తుంది. బిడ్డను పోషిస్తుంది. బిడ్డను రక్షిస్తుంది. బిడ్డకు దైవమే దీవిస్తుంది. అటువంటి అమ్మతనం నుండే ప్రధానమంత్రి అయినా పనిచేసే కార్మికుడైనా... ఎక్కడి నుండి వచ్చాం, చివరి అడ్రస్ అమ్మే అవుతుంది. ఎక్కడికి పోతాం చివరికి అంటే, పైన ఉన్న అమ్మానాన్నలే అంటాం. రక్షణలో అమ్మానాన్నలు అంతగా మనపై ప్రభావం చూపి ఉంటారు

అటువంటి అమ్మ అమ్మాయిగా ఉంటే ఆటబొమ్మలాగా ఎలా కనబడుతుంది? ఎవరిని చూడండి.... చూస్తూ చూస్తూ ఆడపిల్లలు పెద్దవారు అవ్వడం, పెళ్ళి చేయగానే ఇల్లాలిగా తమ పరివర్తనలో పెద్దరికంగా ఆలోచించడం మొదలుపెడతారు. అమ్మాయిలకు అమ్మతనం తెచ్చే మార్పు అది. అమ్మగా మారబోయే అమ్మాయి అంటే అమ్మకిచ్చే గౌరవం ఇవ్వాలి. అటువంటే సమాజమే భారతీయ సమాజం. గాంధీగారు స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. అంటే అర్ధరాత్రి ఒంటరిగా ఆడది కనబడితే, ఆ ఆడదానిలో అమ్మను చూసే యువతే నాటి భారతజాతి అని అర్ధం అయ్యుంటుంది. కానీ అడువారు అంతా కరాటే నేర్చుకుని రాత్రుళ్ళు రోడ్డుపై తిరగమని కాదు కదా...

మనం దైవంగా చూసే అమ్మను కూడా కన్నది ఒక అమ్మాయే. మనిషికి జీవితాన్ని, జీవిత పరమార్ధాన్ని నెరవేర్చుకునే సామాజిక పరిస్థితులు అన్ని ఒక అమ్మాయి, అమ్మగా మారితేనే... లేకపోతే జీవితం ఎక్కడ? అమ్మాయి అమ్మ కాకుండా మనిషి లేడు. జీవితం లేదు. ప్రయోగాలు చేస్తే, అవి వికటిస్తే అనేది చాలా సినిమాలలో చూస్తూనే ఉంటాం.

సహజంగా ఒక వ్యక్తి జీవితం ప్రారంభం అమ్మఒడి నుండే... అమ్మాయి, అమ్మగా మారడానికి, తన ప్రాణాలను పణంగా పెట్టిమృత్యువుతో పోరాడుతుంది. పురుటి నొప్పులు పడే స్త్రీ వేదన మరణవేదనతోనే పోలుస్తారు. మనిషికి మరణవేదన అంటే సహజ బాధ లక్షరెట్లు ఎక్కువైతే ఎలా ఉంటుందో, అలా మరణవేదన ఉంటుందట. అటువంటి మరణవేదన అమ్మాయి పడుతుంది. తను ఒక జీవికి జీవితాన్నివ్వడం కోసం.

ప్రాణత్యాగానికి సిద్దపడి అమ్మాయి, అమ్మ అయితే మనం కదా... మరీ పరస్త్రీలో అమ్మను, అమ్మాయిలో చెల్లిని, తల్లిని చూడలేని జీవితం, ఆజీవితాన్నిచ్చిన అమ్మకడుపుకు కోతే కదా....


బంధం విలువైనది. విలువలు కలిగిన బంధం మరొక విలువైన బంధానికి మార్గం అవుతుంది.


బంధం విలువైనది. విలువలు కలిగిన బంధం మరొక విలువైన బంధానికి మార్గం అవుతుంది.

కొన్ని బంధాలు పుట్టుకతోనే మనిషి చుట్టూ ఏర్పడి ఉంటాయి. ఆ బంధాల సంరక్షణలో పెరుగుతున్న మనిషి, ఆ బంధాల ప్రవర్తనను చూసి, వారి సూచనలను అవగాహన మేరకు అర్ధం చేసుకుంటూ పెరుగుతాడు. యవ్యనంలోకి వచ్చిన వ్యక్తి బంధం ఏర్పరచుకోడంలో స్వతంత్ర్యతను కలిగి ఉంటాడు. అయితే బంధం విలువైనది. విలువలు కలిగిన బంధం మరొక విలువైన బంధానికి మార్గం అవుతుంది.

ఎటువంటి బంధం యవ్యనంలో ఉన్న స్త్రీ, పురుషులు ఏర్పరచుకుంటే, వారిని అనుసరించేవారు కూడా అటువంటి బంధంవైపు నడిచే అవకాశం ఉంటుంది. ఒకరి నుండి ఒకరికి అనుసరణతో కొన్ని బంధాలు ఏర్పడతాయనే ఊహ వలననే వివాహ బంధం యుక్తవయస్సుకు ఏర్పరిచారు. వివాహబంధం ఒక పండుగలాగా చేయడంతో అందులో బంధుమిత్రులు, పిల్లాపాపలతో పాల్గొంటారు. పెద్దలు పెద్దరికం వహిస్తూ ఉంటారు. అటువంటి వివాహ వేడుకలను చూసిన పిల్లలు మరలా అటువంటి పండుగ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు.

వివాహ వేడుకలలో పిల్లల తమ తోటి పిల్లలతో సరదాగా గడుపుతారు. బంధువుల ఆధరణతో మరింత ఉత్సాహవంతులవుతారు. నేర్చుకునే వయస్సులో ఉన్న పిల్లలు, వివాహ వేడుకలలో ఉన్న అందరినీ గమనిస్తూనే ఉంటారు. అక్కడి పెద్దరికం పిల్లలకు ఆదర్శంగా ఉంటే, దానికి కొనసాగించే పిల్లలకు రేపటికి పెద్దవారుగా మారతారు. వివాహ వేడుకలో యువతీ యువకుల పరివర్తన పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుంది.

అయితే అటువంటి వివాహవ్యవస్థ ద్వారా ఒక్కటవ్వాల్సిన యువతదారి తప్పితే, దాని పర్యావసానం తీవ్రంగా ఉంటుంది. నేటి యువతకు బంధాలు ఏర్పరచుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉంటున్నారు. అది ఎంతవరకు అంటే, తమ జీవిత భాగస్వామిని కూడా తామే ఎంచుకుని, వారితో ముందుగానే బంధం బలపరచుకునే స్థాయికి వెళుతుంది. ఇలాంటి బంధాలు పెరగడంతో వివాహవేడుకలలో ప్రమాణాలకు విలువ తగ్గుతుంది.

పెద్దలు కుదిర్చిన బంధంలో ఒక్కటవుతున్న ఇద్దరితోబాటు, వారిని ఒక్కటి చేస్తున్న పెద్దలకు బాధ్యత ఉంటుంది. ఒక్కటైన ఇద్దరు, ఇద్దరుగా విడిపోవాలన్నా, కలిపిన పెద్దల ప్రమాణం వారిని ఆపవచ్చును. కలిచేసుకున్న ప్రమాణాలు వారిని తిరిగి ఒక్కటి చేయవచ్చును. కానీ స్వతంత్రించి ఏర్పరచుకున్న బంధాలలో చాలావరకు బాధ్యత వారి వరకే పరిమితం.

వివాహం ఎలా చేసుకున్నా ఇద్దరికీ జీవితాంతం కలిసి ఉండాలనే వాస్తవ భావన బలం ఎప్పటికీ తగ్గకూడదు. ఇటువంటి బలం చేకూర్చే వివాహం ద్వారా ఒక్కటవ్వడం వలన, అందరి ఆశీస్సులు ఉంటాయి.
వివాహం తరువాత బంధంలో మరొక బంధం ఏర్పడుతుంది. మనం మన తల్లిదండ్రులకు వచ్చిన తీరునే, మనకు మరొక బంధం ఏర్పడుతుంది. కొడుకో... కూతురో... కలుగుతారు. మనం మన తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నట్టే, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. వివాహం జరిగాక బంధం కొనసాగించడంలో ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవాలసిన విషయం, ఇది. మనం నేర్చుకున్నట్టే, మన పిల్లలను అనుసరణ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు.

మనం ఎలాగోలా ఎదిగాం, పెళ్ళి చేసుకున్నాం. పిల్లల్ని కన్నాం. వారు సుఖంగా ఉండాలని చదివిస్తున్నాం. ఇంతవరకు చాలామంది ఆలోచిస్తారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి, తర్వాత కాలేజికి పంపి, ఉద్యోగం వచ్చేవరకు చదివిస్తే, తల్లిదండ్రులుగా బాధ్యత నెరవేరినట్టే. కొత్త బంధాలు ఇప్పుడు ఏర్పడడం సులువుగానే సాగిపోతున్నాయి.

కానీ ఎలా పెరుగుతున్నారు? అనేది చాలా పెద్ద ప్రశ్న. 

పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను, తమ చుట్టూ ఉన్న కుటుంబీకులను, తమతోటివారిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడే ఆదర్శవంతమైన తల్లిదండ్రుల తమ పిల్లలకు మార్గదర్శకంగా నిలబడగలరు. స్కూలుకు, హాస్టలుకు పిల్లలను పరిమితం చేసి, తాము కేవలం డబ్బు సంపాదించేవారిగా మిగిలిపోతే, పిల్లలకు మీ కుటుంబం నుండి వస్తున్న సంప్రదాయం, మీ వారసత్వంగా వస్తున్న విలువలు? 

పుట్టుకతో ఏర్పడిన బంధాల నుండి తాను ఏర్పరచుకుంటున్న బంధాలతో కలిపి మనిషి జీవనం ఎలా సాగిందో? ఒక వ్యక్తి ప్రశ్నించుకుంటే, తనతోపాటు తన చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కూడా చివరి ఫలితంలో కనబడుతుంది. తన ప్రవర్తన తనను చూసి అనుసరిస్తున్నవారిపై పడుతుంది. అప్పటికే తనపై తాను అనుసరించిన వారి ప్రభావం ఉంటుంది.

ఒక వయస్సువారి ప్రవర్తన, నేర్చుకునేవారికి అనుసరణకు మార్గం చూపుతుంది. నేర్చుకున్నవారి పరివర్తన కొత్త ప్రభావం తీసుకువస్తుంది. మనిషి మనసు ఒకరి నుండి నేర్చుకుని మరొకరికి సూచనగా మారుతుంది. అటువంటి మనసు కలిగిన మనసు ఎటువంటి బంధంతో సాగుతున్నాడు, అనేది ముఖ్యవిషయం. ఆ బంధం తమను అనుసరించేవారికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది సామాజిక బాధ్యత. 

బంధం విలువైనది. విలువలు కలిగిన బంధం మరొక విలువైన బంధానికి మార్గం అవుతుంది.
నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠం కావచ్చును. అయితే ఆ పాఠం మనకు ఎలా తెలుస్తుంది? అంటే టివిలలో వచ్చే చర్చా కార్యక్రమములో విశ్లేషకుల వివరణలు న్యూస్ ను ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దిన పత్రికలలో స్పెషల్ స్టోరీస్ పబ్లిష్ చేస్తూ ఉంటారు.

ఈరోజు న్యూస్ ఎంతమందిని ప్రభావితంచేస్తే, అంత త్వరగా ఆ న్యూస్ పైన చర్చా కార్యక్రమములు మొదలవుతాయి. అంత తొందరగా డైలీ పేపర్లలో కధనాలు వస్తూ ఉంటాయి. కధనం ఏదైనా మనలో న్యూస్ పై ఉన్న భావాన్ని ఇంకా బలపరుస్తాయి.

అయితే ఇప్పుడు వస్తున్న మీడియా కధనాలు ఏం చెబుతున్నాయి? అవి మనకు నచ్చిన విషయాలనే బలపరిస్తే, మనం న్యూస్ చూస్తూ టైంపాస్ చేస్తున్నట్టే. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఘటన జరిగినప్పుడు వచ్చిన న్యూస్ వాస్తవంగా ఉంటే, కధనం నిజాలను నిగ్గుతేలాలి అంటూ సాగుతుంది.న్యూస్ ఘటనను తెలియజేస్తే, కధనం ఘటనకు కారణం వెతుకుతుంది. న్యూస్ మనలో ఒక ఆలోచనను సృష్టిస్తే, కధనం న్యూస్ భావాన్ని మరింత బలపరుస్తుంది.

రాజకీయ నాయకుల నిర్ణయాలు, వాటి ప్రభావాలు అంటూ సాగే కధనాలను చదవడం వలన ప్రస్తుత రాజకీయ పరిస్థితి అవగాహన వస్తుంది. రాజకీయ పరిస్థితులపై, సామాజిక సమస్యలపై అందరికీ అవగాహన అవసరం. ఎందుకంటే ఎన్నికల వేళలో అప్పటికప్పటి ట్రెండును బట్టి, ఫలితాలు ప్రభావం అవుతూ ఉంటాయి. అయితే ఎక్కడైతే దీర్ఘకాలికంగా తమ సమస్యలపై అవగాహన ప్రజలందరిలోనూ అవగాహన ఏర్పడుతుందో, అప్పుడు అక్కడ ఆ సమస్య తీరేవరకు ప్రజలు ఆ సమస్యకు నాయకత్వం వహించిన నాయకుడికే పట్టం కడతారు.


ఉదాహరణకు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. 


తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడాలంటూ కె చంద్రశేఖరరావు చేసిన దీక్షలు, ఆయనతో బాటు కలసి వచ్చిన జేఏసి, అఖిల పక్ష రాజకీయ పార్టీల ఉద్యమాలు, అన్ని కలిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే పట్టుదలను ఎక్కువగా చూపింది. కె చంద్రశేఖరరావుగా కనబడడంతో, ప్రజలు కెసిఆర్ నోటిమాటపై ఎన్నికలలో ఇప్పటికి రెండుసార్లు గెలిపించారు. ఎందుకంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తెరగడంతో అందరూ రోడ్లపైకి వచ్చారు. తమకు నాయకత్వం వహించిన నాయకుడిని గెలిపిస్తున్నారు.

అంటే అందరికీ తమ తమ ప్రాంతీయ సమస్యలపై సరైన అవగాహన ఉంటే, ఆ సమస్యకు ఎవరైనా నాయకత్వం వహించినప్పుడు, ఆ సమస్యకు అందరి నుండి రెస్పాన్స్ తొందరగా వస్తుంది. తొందరగా రెస్పాన్స్ రావడం వలన అందరిలోనూ ఆ సమస్యపై ఐకమత్యం ఏర్పడుతుంది. తత్ఫలితం సమస్య సాధించబడుతుంది. అందుకనే న్యూస్ నుండి కధనం వరకు మనకు వాటిలో వాస్తవం కనబడాలి.

నేను ఒక్కడినే న్యూస్, కధనాలు అర్ధం చేసుకోకపోతే ఏమౌతుందిలే అనుకుంటే పొరపాటు. సమస్యపై ఎక్కువమంది స్పందించినప్పుడే, ఆ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది. ఎక్కువమందికి సమస్యకు స్పందించాలంటే, ఆ సమస్యపై అందరికీ అవగాహన అవసరం.ఒక్కరి సమస్యకు అతను, అతని చుట్టూ ఉన్నవారు పోరాడుతూ ఉంటారు. అయితే ఒక ప్రాంతానికి సమస్య ఉంటే, ఆ ప్రాంతంలోని వారందరికీ ఆ సమస్య తీవ్రత తెలుసుండాలి. ఆ సమస్య పరిష్కరించడం వలన మనకు, మన భవిష్యత్తు తరానికి జరగబోయే మేలు కూడా తెలుసుండాలి. అప్పుడే ఆ సమస్యపై అవగాహన అందరికి వస్తుంది. అందరిలో అవగాహన ఉన్నప్పుడు, ఆ సమస్యకు ఎవరైనా నాయకత్వం వహిస్తే, వెంటనే సమాజం నుండి స్పందన వస్తుంది. ఎక్కువ మంది స్పందిస్తే, సమస్య పరిష్కరించబడుతుంది.

సమస్య మనకు అర్ధంకాకుండా ఉన్నన్నాళ్లు ఆ సమస్య గురించి ఆలోచన రాదు. న్యూస్ మరియు కధనాలు, న్యూస్ మరియు చర్చలపై అవగాహన లేకుండా ఉంటే మన సమస్యలు మనకే అర్ధం కావు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పాల్గొన్నారంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అందరూ కోరుకున్నారు. ఫలితంగా అందరూ తీవ్రస్థాయిలో ఉద్యమించారు.

మన సామాజిక పరిస్థితులు,  మన సామాజిక సమస్యలపై మీడియా అందించే న్యూస్, వాటిలోనే వచ్చే కధనాలతో మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందరిలోనూ కనెక్ట్ అయ్యే సరికి సమయం పడుతుంది. వాస్తవంగా ఆ సమస్యలోని తీవ్రత ఎక్కువమందిని ఇబ్బంది పెడితే, సమస్యల సెగ మరింత వ్యాప్తి చెందుతుంది.

 న్యూస్ వ్యాప్తి చెందితే, కధనం కారణాన్ని ఎత్తి చూపుతుంది. న్యూస్ విని ఎనలైజ్ చేసుకుంటున్న మనకు దానిపై వచ్చిన కధనం మన ఎనలైజుని సపోర్ట్ చేస్తుంది. ఇది అందరిలోనూ వచ్చినప్పుడు దానిపై సమాజం ఏకధాటిగా స్పందిస్తుంది. చిన్న చిన్న సమస్యలకు వ్యవస్థ చూసుకుంటుంది. కానీ రాజకీయం ముడిపడి ఉన్నప్పుడు మాత్రం ఏకధాటిగా అందరి స్పందన ఒక్కటైనప్పుడే, సమస్య నుండి రాజకీయం విడివడి సమస్య ప్రధానంగా మారుతుంది. రాజకీయం లేని సమస్య పరిష్కారానికి దగ్గరవుతుంది.రాజకీయం సమస్యను పరిష్కారదిశగా నడిపించాలి కానీ రాజకీయం సమస్యను మరింత జఠిలం చేయకూడదు. నేటి న్యూస్, కధనాలు, చర్చలు, స్పెషల్ స్టోరీస్ చూడండి. నేటి సమస్యలకు రాజకీయం ఎలా పట్టుకుందో తెలియవస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయం అవసరం. కానీ సమస్యను దీర్ఘకాలికంగా సాగదీసే రాజకీయం నాయకుల మనుగడకే ముప్పు తీసుకువస్తుంది.

నేటి న్యూస్ రేపటికి గీతా పాఠంగా మారుతుంది. నాయకులకు ఎన్నికల వేళకు తెలియవస్తుంది. ప్రజలకు ప్రభుత్వ పాలనలో తెలియవస్తుంది. విధానం ప్రవాహం వంటిది, ప్రవాహం దిశ మారాలంటే విధానమునకు మూలమైన సామాజిక అవగాహన అవసరం. అందరిలోనూ విధానం దిశపై ఒక అవగాహన ఉంటే, అందరూ ఏది కోరుకుంటే, అదే జరుగుతుంది.

ధన్యవాదాలు

ఆర్ధిక మాంద్యంలోనూ కోట్లు వసూలు చేసిన సినిమాలు

ఆర్ధిక మాంద్యంలోనూ కోట్లు వసూలు చేసిన సినిమాలు

2019 అనగానే ప్రపంచంలో మొదట గుర్తుకు వచ్చేది, ఎన్నికల తరువాత ఆర్ధిక మాంద్యం. దీనివలన ఆటోమొబైల్ రంగం కుదేలవ్వడం జరిగింది. అనేక రంగాలలో ఆర్ధికంగా వెనకబడడం జరిగింది. వాహనాల కొనుగోళ్ళు తగ్గాయి. కరెంటు వాడకం తగ్గింది. వృద్దిరేటు 2013 కన్నా తగ్గింది. బిస్కట్ ప్యాకెట్ల అమ్మకాలు తగ్గినట్టుగా చెప్పారు. పెట్రోలు, డీజిల్ వాడకం కూడా కొంచె తగ్గుముఖం పట్టినట్టే. కారణం ఆర్ధికమాంద్యం.

ఆర్ధికమాంద్యం అన్ని రంగాలపై ఉంటే, సినిమా రంగంపై ఆర్ధికమాంద్య ప్రభావం పడకపోవడం విశేషం. ఆర్ధికమాంద్యం ఉన్నా సినిమాలు చూడడంలో సినీ అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు ట్రంప్ మాటలే ఉదాహరణగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణను చూడండి.


2020సంక్రాంతికి వచ్చిన రెండుతెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం విశేషం.రెండుతెలుగుసినిమాలు కలిపి 350కోట్ల వరకు వెళ్ళడం విశేషం. ఈ లెక్కన మనకు ఆర్ధిక మందగమనం ఉన్నా వినోదానికి తావుండదు.

అవును డబ్బు లేదని బాధపడడం కన్నా కాసేపు సంతోషించి కష్టపడడమే ఉత్తమం. కొనుగోలు శక్తి లేకపోతే వస్తువులు కొనరు కానీ మనసును మాత్రం బాధపెట్టరని తేలుతుంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ ఆర్దిక మాంద్యంలో కూడా బాగుండడం సినిమా ఇండస్ట్రీపై ఆధారపడ్డవారికి మేలు.

ధన్యవాదాలు.

పవర్ స్టార్ పవర్ పుల్ యాక్టర్ అండ్ లీడర్

పవర్ స్టార్ పవర్ పుల్ యాక్టర్ అండ్ లీడర్

అగ్రనటుడుకు అనుజుడు అయినా తనకంటూ సినీ అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. చిరంజీవికి తమ్ముడుగా పరిచయం అయినా తనని తాను స్క్రీనుపై ప్రెజెంటు చేసుకోవడంలో విజయవంతమైన నటుడు.

విజయాలను గొప్పగా చెప్పుకోకుండా ఉండడం ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ మరింతగా దగ్గరయ్యాడు. అన్నగారి రాజకీయ అరంగేట్రంలో కీలక బాధ్యతలను సేకరించిన పవన్ కళ్యాణ్. అన్నగారి రాజకీయ నిష్క్రమణ అనంతరం కూడా రాజకీయాలలో చురుగ్గా పనిచేశారు.


సినిమాలలో అన్నగారి పేరుతో పనిలేకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్టే, రాజకీయాలలోనూ అన్నగారి పార్టీ తీసివేశాకా, తనే ఒక పార్టీని ప్రారంభించి రాజకీయ సంచలనం సృష్టించారు. జనసేన పార్టీని స్థాపించారు. 2014లో పవన్ కళ్యాణ్ టిడిపికి, బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు. 2019లో సొంతంగా జనసేన పార్టీ పోటీ చేసింది.

జనసేన పార్టీ 2019లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆపార్టీకి మంచి రాజకీయ పార్టీగా గుర్తింపు అభిమానుల్లో ఉంది. ఎన్నికలలో తను గెలవకపోయినా ప్రజలలోనే ఉండి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడంలో పవన్ కళ్యాణ్ విశ్లేషకులు ప్రశంసలు అందుకున్నారు.

 ఇసుక పాలసీపై ప్రజాక్షేత్రంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, అమరావతి రాజధాని రైతులను కలిశారు. సుగాలి ప్రీతి కేసులో పురోగతి సాధించడానికి కృషి చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలితంగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించినట్టుగా చర్చలో కూడా విశ్లేషకులు పవన్ అభినందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కల్పించుకోగానే, వైసిపి ప్రభుత్వం కూడా ఆమె కేసును సిబిఐకి అప్పగించినందుకు జగన్ ప్రభుత్వాన్ని కూడా విశ్లేషకులు గుర్తుచేశారు.


సినిమాలను ప్రక్కన పెట్టి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ మరలా సినిమాలో నటించడం మొదలుపెట్టారు. 'పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించను అని చెప్పి మరలా సినిమాలలో నటిస్తున్నందువలన, నేను జనసేన పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు' జెడి లక్ష్మినారాయణ చెప్పారు. సొంతపార్టీలో నుండి ఒకరిద్దరు వ్యతిరేఖత వచ్చినా, పవన్ సినిమాలలో నటించడం తప్పుకాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రజా సమస్యలపై ప్రజల మద్యన ఉండడం అవసరమని కొంతమంది భావిస్తే, కొంతమంది సినిమాలు చేస్తూ రాజకీయాలలో ఉండవచ్చని భావిస్తూ ఉండవచ్చును. కానీ నేటి రాజకీయాలలో ఉన్న చాలామంది, రాజకీయాలలో ఉంటూనే, వారి సంపాదన మార్గాలను వదలనప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించడం తప్పుకాదనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది.

2024లో అధికారమే లక్ష్యంగా బిజెపితో జట్టు కట్టిన జనసేనాని, సినిమాలలో నటిస్తూ, రాజకీయం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. హిందీలో హిట్ అయిన పింక్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

ప్రజలపై ప్రభావం చూపే రంగాలలో సినిమా రంగం ఒక్కటి. రాజకీయం సమాజంపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే, సినిమా రంగం రాజకీయంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. గతంలో చాన్నాళ్ళు సినిమా రంగంలో సుస్థిరపడ్డాకా నటులు రాజకీయంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ తన కెరీర్ మంచి స్థాయిలో వెళుతుండగానే, సినిమా కెరీర్ ప్రక్కనబెట్టి రాజకీయాలలోకి రావడం విశేషం.

భావావేశం బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారు. సమాజం బాగుండాలనే కాంక్షతో పనిచేసే నాయకుడికి ప్రజలు పట్టం కడతారు. ప్రస్తుతం రెండు రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ ప్రభావం సమాజంపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఏమేరకు ఉంటుందనేది, కాలమే నిర్ణయించాలి.

ధన్యవాదాలు


Friday, February 28, 2020

నేటి న్యూస్ రేపటి కధనంగా ఉంటే, కధనాలు మనలో భావాన్ని బలపరుస్తాయి.

నేటి న్యూస్ రేపటి కధనంగా ఉంటే, కధనాలు మనలో భావాన్ని బలపరుస్తాయి.

న్యూస్ పేపరు చదివేవారికి న్యూస్ పేపరు చూడకపోతే తెల్లవారినట్టుండదు. ఇక న్యూస్ ఛానల్స్ వీక్షించేవారు న్యూస్ ఛానల్స్ చూడందే కుదరదు. ఎలాగోలా రోజూ న్యూస్ చదవడం లేక చూడడం చేసేవారు ఎక్కువగానే ఉంటారు. ఉదయం న్యూస్ తెలుసుకోవడం దైనందిన జీవితంలో భాగం అవుతుంది.

డైలీ చూస్తున్న న్యూస్ మనసులో ఒక భావం పెంచుతుంది. వింటున్న న్యూస్ మైండులో ఊహనుతెస్తాయి. సినిమా న్యూస్ చూస్తే, సినిమాలపై ఆసక్తి పెరుగుతుంది. పొలిటికల్ న్యూస్ చదివితే, పాలిటిక్స్ అంటే ఆసక్తి ఎక్కువ అవుతుంది. క్రికెట్ న్యూస్ వింటే, క్రికెట్ చూడాలనిపిస్తుంది.

ఇలా ఏవిధమైన న్యూస్ మనం వినడం లేక చూడడం లేక చదవడం చేస్తామో, అటువంటి ఆలోచనలే మనసులో పెరుగుతాయి. వాటిపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉంటాము. ఈ విధంగా న్యూస్ ఆలోచింప జేస్తాయి. మనతో మాట్లాడిస్తాయి. ఇలా మన మైండులో ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఇక పొలిటికల్ లీడర్స్ కు సంబంధించిన న్యూస్ చూస్తే, ఎన్నికల వేళలో ఆ లీడర్ గెలుపు, ఓటములపై ప్రభావం కనబడుతుంది. సాధారణ న్యూస్ మనకు దీర్ఘకాలిక సామాజిక స్థితిని తెలపుతూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ భిన్నమైన పరిస్థితులను సూచిస్తాయి. సాధారణ న్యూస్ ఎక్కువగా జరిగే విషయాలే, మరలా రిపీట్ కావడం.

కానీ బ్రేకింగ్ న్యూస్ అంచనాలకు అందనివి. పరిస్థితులను తారుమారు చేసేవిగా ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ ఎక్కువమందికి తొందరగాపాకితే, సాధారణన్యూస్రోజూన్యూస్ వాచ్ చేసే వారికి తెలుస్తుంది. మనకు న్యూస్ సామాజిక మార్పులను, సంఘటనలను, నేతల నిర్ణయాలను, వ్యాపార విధానమును మరియు ఇతర రంగాలలో విశేషాలను తెలియజేస్తాయి.

సినిమా న్యూస్ చదివేవారు సినిమాలు చూడడానికి ప్రిపేర్ అవుతారు. సినిమా చూసేటప్పుడే, అంతకుముందు ఆసినిమా న్యూస్తెలుసుకుని ఉండడం వలన, సినిమా చూస్తున్నప్పుడుసినిమా ఊహ మన మైండులోమెదులుతుంది.

అలాగే పొలిటికల్ న్యూస్ చూసేవారి ప్రభావం, ఓటింగ్ వేళలో నాయకుల గెలుపు, ఓటములను నిర్ధేశిస్తాయి. నేటి సమాజం అంతా టెక్నాలజీ మయం. కాబట్టి న్యూస్ చాలా వేగంగా ప్రజలకు చేరుతుంది.

డైలీ మనం చూసే న్యూస్ మనలో ఒకభావం పుట్టిస్తుంది. ఒకవేళ ఒక్కటే న్యూస్ పలుమార్లు చూస్తూ సంబంధిత న్యూస్  భావన బలపడుతుంది. బలపడిన భావన మైండులో అలానే ఉంటుంది. ఇతరులతో మాట్లడేవరకు ఆ న్యూస్ భావన మైండులోనే ఉంటుంది. లేదా మరొక ఆసక్తికరమైన న్యూస్ వచ్చేవరకు ఈ న్యూస్ నానుతూనే ఉంటుంది.

పత్రికలోని న్యూస్ కధనాలు, టివి చానల్లోని స్పెషల్ స్టోరీస్ వీక్షకులను ఆలోచింపచేస్తాయి. కధనాలు, స్పెషల్ స్టోరీస్ ఏదైనా బలమైన సామాజిక కదలికలను లేదా మార్పులను తెలియజేస్తూ ఉంటాయి. సారం కలిగిన కధనాలు ఆలోచనను కలిగిస్తాయి.

కధనాలు. ప్రత్యేక కధనాలు సామాజిక స్థితిని లేక మార్పును గురించి తెలియజేస్తూ ఉంటాయి. నేటి న్యూస్ రేపటికి గీతోపదేశం అన్నట్టుగా కధనాల రూపంలో వస్తూ ఉంటాయి. అయితే అవి బలమైన మార్పులకు గురిచేసే న్యూస్ అయితే మరుసటి రోజుకు కధనంగా మారుతుంది.

ఇండియన్ క్రికెట్ టీమ్ వరుసగా విజయపరంపరతో సాగుతుంటే, టీమిండియా విజయాలు అంటూ ఒక కధనం ఏదైనా న్యూస్ పేపర్ వ్రాస్తుంది. టివి చానల్స్ కూడా అంతే, ఎదురులేని టీమిండియా అంటూ ఫోకస్ పెడతాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన సీజన్లో బ్యాటింగ్ బాగా చేసినవారిని, బౌలింగ్ బాగా చేసినవారిని, ఆల్ రౌండు ప్రతిభ కనబరిచినవారిని హైలెట్ చేస్తూ కధనాలు వస్తూ ఉంటాయి. ఇక ఆ సీజన్లో ఒంటిచేత్తో ఎవరైనా మ్యాచులు గెలిపించి ఉంటే, అతని ప్రతిభను చెబుతూ అతని ఆటతీరును హైలెట్ చేస్తూ కధనాలు వస్తూ ఉంటాయి.

అదే ఇండియన్ క్రికెట్ టీమ్ వరుస పరాజయాల బాట పడితే, టీమిండియాలో జట్టు మార్పు ఆవశ్యకతను గుర్తిస్తున్నట్టు కధనాలు వస్తాయి. ఆ సీజన్లో సరిగ్గా ఆడని వారిని హైలెట్ చేస్తూ, వారు గత సీజన్లలో ఆడిన ఆటతీరు, ఇప్పటి ఆటతీరుకు బేరీజు వేస్తూ కధనాలు పుట్టుకొస్తాయి.

ఈవిధంగా క్రికెట్ టీమ్ విజయాలవైపు వెళితే, విజయదుందుభి కధనం. లేకపోతే పరాజయాల బాటలో భారత్ మరొక కధనం ఉంటూ ఉంటాయి. ఇదేవిధంగా న్యూస్ స్టోరీస్ ఒక సినిమా హీరో కెరీర్ ను కూడా విశ్లేషిస్తాయి. అలాగే ఒక రాజకీయ నాయకుడి కెరీర్, రాజకీయ పార్టీ విజయయాత్ర రాజకీయ విశ్లేషణలుగా కధనాలు వస్తాయి.

ఇలా వార్తా కధనాలు మన మనసులో ఉన్న న్యూస్ భావాలలో ఒక భావాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఉదా: మీరు కోహ్లి క్రికెట్ రికార్డ్స్ మాత్రమే చూస్తున్నారనుకోండి. టీమిండియా విజయాలవైపు వెళుతున్న కధనాలు చదివితే, మీ మనసులో కోహ్లి బెస్ట్ కెప్టెన్ అనే భావన బలపడుతుంది. అదే టీమిండియా పరాజయాలవైపు వెళితే, టీమిండియాలో బాగా ఆడని ఆటగాళ్ళపై దృష్టి వెళుతుంది. అలా ఒక కధనం మన మనసులో నాటుకున్న న్యూస్, కధనం వచ్చాక మరింత బలపడతాయి.

ఏదైనా నేటి న్యూస్ మరొకనాటికి గీతగా మారుతుంది. నేటి న్యూస్ రేపటి కధనంగా ఉంటే, కధనాలు మనలో భావాన్ని బలపరుస్తాయి.

ధన్యవాదాలు
న్యూస్ గీత

న్యూస్ గీత బ్లాగుకు స్వాగతం.

న్యూస్ గీత బ్లాగుకు స్వాగతం. 

బ్లాగును దర్శించినందులకు మీకు మా ధన్యవాదాలు. త్వరలో మరిన్ని పోస్టులు మా న్యూస్ గీత బ్లాగులో పోస్టు చేయబడతాయి.

ధన్యవాదాలు
న్యూస్ గీత

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...