Saturday, March 21, 2020

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు.
మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమాజానికి రక్షణ. కరోనా వైరసుకు సోకకుండా నివారణ ముఖ్యమంటున్నారు. అశ్రద్ద వలననే ఇటలీలో కరోనా వ్యాప్తి చెంది అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అదీ అతి కొద్ది కాలంలోనే.

మేలైన మాటలు వినడం కన్నా పాటించడం ముఖ్యం. ఇక ఆరోగ్యానికి సంబంధించినవి ఖచ్చితంగా పాటించాలి. అయితే అదీ సామాజికపరమైన ఆరోగ్య రక్షణకు అయితే ముమ్మాటికీ పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి సోకి వేలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వ్యాధిని అరికట్టాలంటే, యుద్దమే చేయాలి.

నిత్యం అందరితో కలిసిమెలిసి ఉండే జనులు నేడు ఒంటరిగా కాలం గడుపుతూ కరోనాపై యుద్దం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా కలిగితే ప్రాణాలో పోవడంతో బాటు అది మనద్వారా మరింతమందికి సోకే అవకాశం ఉంది. కాబట్టి మనకు రాకుండా జాగ్రత్తలు పాటించడం మన ప్రధానమైన కర్తవ్యం. మనందరి సామాజిక బాధ్యత.

ప్రధాని నరేంద్ర మోదీగారు పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను గెలవాలంటే, భారతీయుల ఐక్యత చాలాముఖ్యం. అయితే ఈ ఐక్యత ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇంటిలోనే ఉండడం. ఈ రోజు ఆదివారం. ఆదివారం అందరితో కాకుండా మనలో ఉన్న ఆత్మబంధువుతో మమేకం కావడం వలన ఏకాంతంగా ఉంటూ, మానసికంగా దృఢంగా తయారు కావచ్చును. కరోనా అడ్డుకోవడంలో మనవంతు కృషి చేసినవారము అవుతాం.

కేవలం ఈరోజుకే పరిమితం కాకుండా కొన్ని వారాలపాటు ఏకాంతంగా మెసలడం ముఖ్యం. నలుగురితో కలిసి తిరగకుండా ఒకరినొకరు దూరంగా మెసలడం. జనసంద్రం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడం చాల ముఖ్యం. అవసరం మేరకు మాటలు తగు జాగ్రత్తతో మాట్లాడడం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించడం చాలా ముఖ్యం.

కరోనా వలన దేశాల పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. కాలం కలసి రానప్పుడు నిదానంగా నిలబడడమే ముఖ్యమంటారు. ఇప్పుడు కాలం కరోనా కాలం కాబట్టి నిదానమైన ప్రధాన పనులు మాత్రమే తగు జాగ్రత్తతో ఉంటే, భవిష్యత్తులో కరోనా ప్రభావం తగ్గుతుంది. ఇటలీ, చైనా దేశాలకు పట్టిన గతి మనకు పట్టకూడదంటే, ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉండకూడదు. కరోనాపై ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఒకరికొకరికి దూరం పాటించడం. ఎప్పటికప్పుడు శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని సూచిస్తున్నారు.

కరోనాను కలసిగట్టుగా ఎదుర్కోవాలి. అంటే ఒకరినొకరు తాకకుండా సాద్యమైనంత దూరం పాటించడంలో అంతా కలిసిగట్టుగా ప్రయత్నించాలి.

ధన్యవాదాలు

కరోనా కష్టం చిరువ్యాపారికి నష్టం

కరోనా కాలం చిరువ్యాపారికి కష్టకాలం. కష్టంచేసుకుని బ్రతికే చిరువ్యాపారులకు కరోనా కాలం కష్ట కాలమే..

కరోనాకు కష్టకాలం రావాలంటే దేశమంతా ఏకం కావాలి

కరోనాకు కష్టకాలం రావాలంటే దేశమంతా ఏకం కావాలి

ఒక కష్టం వస్తే ఏకం కానీ కుటుంబం ఉండదు. ఒక ఉపద్రవం వస్తే ఏకం కానీ ప్రాంతం ఉండదు. కానీవారితో కూడా కలిసి పనిచేస్తాం కష్టకాలంలో... కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని సవాలు చేస్తుంది. పూర్వంలో రాక్షసులు మనుషుల్ని పీడించేవారు అని అంటారు. కానీ ఇప్పుడు వైరస్ లు మాత్రం మనిషికి మహా శత్రువుగా మారుతున్నాయి.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీగారు జనతా కర్ఫ్యు పిలుపినిచ్చారు. అంతర్జాతీయంగా కూడా ఈ పిలుపుకు ప్రధాన్యత ఏర్పడింది.

ప్రపంచంలో మొదటి కరోన కేసు నమోదైన చైనాలో కరోనా కేసులు ఇప్పుడు లేవంటున్నారు. లేటుగా ప్రవేశించిన కరోనా మన దేశంలో రెండవ దశలో ఉంది. ఈ దశలోనే కరోనా అంతం కావాలంటే, దేశమంతా ప్రధాని మోదీగారు ఇచ్చిన పిలుపుకు ఏకం కావాల్సిందే.


గతంలో రకరకాల వైరసులు వచ్చి మానవులపై ప్రభావం చూపాయి. కానీ ఇప్పుడు కరోనా లోకాన్ని కలవరపెడుతుంది. వేలాదిమందిని బలిగొంది. ఒకరి నుండి ఒకరికి పాకే ఈ అంటువ్యాధిని అరికట్టడానికి శుభ్రతతో బాటు ఏకాంతంగా ఉండడం కూడా ముఖ్యమని అంటున్నారు.

గుంపులో ఒకరికి కరోనా వైరస్ వచ్చి ఉంటే, ఆ గుంపులో మిగిలినవారికి కూడా సోకే ప్రమాదం ఉంది. అటువంటి కరోనా నివారణకు గుంపులలో తిరగకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎక్కువమంది తిరిగే మార్కెట్లలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడవలసిని కాలం కరోన వలన మనకు కలిగింది.

శుభ్రతతో బాటు ఎదుటివారితో మాటలవరకే పరిమితం కావాలి. కరచాలనం కన్నా నమస్కారం మిన్న. కరచాలనం ద్వారా కూడా కరోనా వైరస్ సోకవచ్చును. ఈ క్రింది వీడియో ద్వారా కరోనా ఒకరినుండిఒకరికి ఏవిధంగా సోకుతుందోతెలుసుకోండి.
కరోనాకు కష్టకాలం రావాలంటే, దేశమంతా ఏకం కావాలి. ఒక వ్యక్తి తలచుకుంటే భగవానున్ని ప్రత్యక్షం చేసుకోవచ్చును. మరి దేశమంతా తలచుకుంటే కరోనాకు కనిపించకుండా పోతుంది. శుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలతో బాటు కూడలిలోకి రాకుండా ఇంటికే పరిమితమై ఉండడానికి తయారు కావాల్సిన తరుణం ఇప్పుడే.

ధన్యవాదాలు---

Sunday, March 8, 2020

2017నుండి ఐపిఎల్ ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ టీమ్

ఐపిఎల్2020 సీజన్ ఈనెలనుండే ప్రారంభం కానుంది. ఈ నెలాఖారున ప్రారంభం కానున్న ఐపిఎల్2020 సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కవచ్చును. గతఐపిఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ కు దక్కింది. వార్నర్ 692 రన్స్ చేసి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ ఐపిల్2020 సీజన్ కు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో?

డేవిడ్ వార్నర్ టి20 అంతర్జాతీయ మ్యాచులలో 581 పరుగులు సాధించి ఉన్నాడు. అయితే ఇదే ఫార్మట్లో లోకేశ్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇతను 823 పరుగులు సాధించి, టి20లో టాప్ ఈ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. ఫించ్ టి20 మ్యాచులలో 820 పరుగులు సాధించి టాప్3టి20 బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. ఆ తర్వాత కొలిన్ మున్రో, మ్యాక్స్ వెల్, డేవిడ్ మాలన్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. రోహిత్ శర్మ టి20 మ్యాచులలో 662 పరుగులు సాధించి ఉన్నాడు. విరాట్ కోహ్లి టి20 మ్యాచులలో 673 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్స్ టి20 మ్యాచులలో 584 పరుగులు సాధించి ఉన్నాడు. వరల్డ్ టి20లో ఎక్కువ పరుగులు సాధించి ఉన్నారు.అయితే ఐపిఎల్ మ్యాచులు పూర్తిగా ఇండియాలో జరుగుతుండంతో ఎవరు ఎలా ఆడతారో చెప్పలేం. కానీ లోకేశ్ రాహుల్ (KXIP), ఫించ్(RCB), మున్రో, మ్యాక్స్ వెల్, రోహిత్ శర్మ(MI), విరాట్ కోహ్లి(RCB), కేన్ విలియమ్స్(SRH), శిఖర్ ధావన్(DC), హార్దిక్ పాండ్య(MI), ఎంఎస్ ధోని(CSK), డికాక్(MI), అండ్రూ రసెల్(KKR), శ్రేయాస్ అయర్(DC), డివిలియర్స్(RCB), స్ట్రోక్స్(RR), షేన్ వాట్సన్(CSK) వీరంతా విద్వంసకరమైన బ్యాటింగ్ చేయగలరు. మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించగలరు. వీరిలో ఎవరూ పుల్ ఫామ్ ఆడితే ఆ టీమ్ ప్లేఆఫ్ కు చేరినట్టే.

2017నుండి ఐపిఎల్ ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ టీమ్ సభ్యులలోనే ఉంటుంది. ఈ సారీ కూడా అదే కంటిన్యూ అవుతుందో లేక వేరే టీమ్ సభ్యులు సాధిస్తారో? చూడాలి.

ధన్యవాదాలు...


రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ టీమ్

డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్

డిల్లి కేపిటల్స్ ఐపిఎల్ టీమ్

Saturday, March 7, 2020

చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్.

ముంబై వాంఖైడ్ స్టేడియంలో చెలరేగిన సచిన్ టెండుల్కర్ - సెహ్వాగ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫోర్లతో స్టేడియం చుట్టూ బంతిని పంపించిన సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ పార్టనర్ షిప్. రిటైరైనవారు మరలా ఇండియా తరపున ఆడడం ఏమిటి? అనుకుంటున్నారా? రోడ్ సేఫ్టిపై అవగాహన పెంచేందుకు నిధుల సమీకరణకు మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్వహిస్తున్న లెజండరీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ టీమ్ తో శనివారం తలపడింది.లెజండరీ టి2020 వరల్డ్ సిరీస్ లో ఆరంభ మ్యాచులో వెస్టిండీస్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసి, 20ఓవర్లలో 150 పరుగులు చేసింది. చందర్ పాల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ ఉంటే, భారత బౌలింగ్ లో ప్రజ్ఙాన్ ఓజా, జహీర్ ఖాన్,  మునాఫ్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టార్గెట్ చేదించింది. ఇందులో సెహ్వాగ్ 11 ఫోర్లతో 57 బంతుల్లో 74 పరుగులు చేస్తే, సచిన్ టెండుల్కర్ 29బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు. వీరిద్దరి బ్యాటింగ్ స్టేడియంలో అందరినీ అలరించింది.

ఈ సిరీస్ లో భాగంగా భారత్ జట్టు మంగళవారం శ్రీలంకతో ఆడనుంది. ఇంకా ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా మ్యాచులు ఆడనున్నాయి. పాత ఆటగాళ్ల సొగసైన ఆటను ఈ లెజండరీ టి20 సిరీస్ లో చూడవచ్చును.

ధన్యవాదాలు

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం

జనతా కర్ఫ్యూ జనులంతా ఏకభావనతో బౌతిక దూరం పాటించడం వలన కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చు. మనకోసం మనం తీసుకునే శ్రద్ద మనకు రక్ష, మనతోబాటు సమా...